తమిళనాడులోని కవలలు ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. కొన్ని సార్లు వాళ్లని గుర్త పట్టడం కూడా కష్టమే. అయితే వారి మార్కులు కూడా సేమ్‌గా ఉంటే ఎంత అశ్చర్యంగా ఉంటుంది కదూ.కవలలు(Twin Sisters) పదో తరగతి పరీక్షల్లో ఒకే మార్కులు సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.కోయంబత్తూరులోని రామనాథపురం ప్రాంతానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్విల కుమార్తెలు కవిత, కనిక(Kavitha,Kanika) కవల పిల్లలు. ఈ ఇద్దరు అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. అయితే తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని తెలుసుకునేందుకు వెళ్లి ఈ సిస్టర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరికీ ఒకే మార్కులు వచ్చాయి.కవిత మార్కులు చూస్తే, తమిళం- 95, ఇంగ్లీష్-98, గణితం – 94, సైన్స్ – 89, సోషల్– 98, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఇక కనిక మార్కులు చూసే, తమిళం– 96, ఇంగ్లీష్ – 97, గణితం – 94, సైన్స్ – 92, సామాజిక శాస్త్రం – 95, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గణితంలో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి.ఇద్దరికీ ఇలా ఒకే మార్కులు వస్తాయని తాము కూడా ఊహించలేదని ట్విన్ సిస్టర్స్ చెప్పారు. ఇలా మాకు ఒకే మార్కులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని కవిత, కనిక చెప్పుకొచ్చారు.

అత్యధిక
93.80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 91.74 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 95.88 శాతం. 1867 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.ఈ పబ్లిక్ పరీక్ష(Public exams)కు సంబంధించి శివగంగ జిల్లా అత్యధిక ఉత్తీర్ణత రేటుతో తమిళనాడు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. గతసారి మొదటి స్థానంలో నిలిచిన అరియలూర్ జిల్లా ఈ ఏడాది 8వ స్థానానికి వెళ్లింది. వెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది.

Read Also : Cononel Sophia: సోఫియాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి.. అసలు వివాదమేంటి?