భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకరి తర్వాత ఒకరు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇద్దరూ భారత జట్టులో అత్యుత్తమ కెప్టెన్లుగా కూడా ఉన్నారు. ఈ విషయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో ఎంతమందికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ కెప్టెన్సీ ప్రధానంగా నిలిచింది.విరాట్ కోహ్లీ చాలా మంది ఫాస్ట్ బౌలర్లకు అరంగేట్రం చేసే అవకాశాన్ని కల్పించాడు. 2014 నుంచి 2022 వరకు టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 13 మంది ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. ఇందులో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, జయంత్ యాదవ్, నమన్ ఓజా,హనుమ విహారి, రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, స్పిన్నర్లు కరణ్ శర్మ, కరుణ్ నాయర్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఉన్నత స్థాయికి ఎదిగారు.

పరిచయం
రోహిత్ శర్మ 2022 నుంచి 2024 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2 సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్ శర్మ 11 మంది ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. ఇందులో ఆకాశ్ దీప్, వికెట్ కీపర్ కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లుకు రోహిత్ శర్మ(Rohit Sharma) అవకాశం కల్పించాడు.సౌరవ్ గంగూలి కెప్టెన్‌గా ఉన్నప్పుడు 19 మంది ఆటగాళ్లను, ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 11 మంది ఆటగాళ్లను , ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను, రహానే కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏడుగురు ఆటగాళ్లను, బుమ్రా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇద్దరు ఆటగాళ్లను, సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నలుగురు ఆటగాళ్లను పరిచయం చేయడం గమనార్హం.
Read Also: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ను వీడనున్న మిచెల్ స్టార్క్?