हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Droupadi Murmu: ఎవరు సుప్రీం?

Vanipushpa
Droupadi Murmu: ఎవరు సుప్రీం?

బిల్లుల ఆమోదంలో గవర్నర్లకు గడువుపై ‘సుప్రీం’
తీర్పును ప్రశ్నించిన రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువును నిర్దేశించగలవా?
రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద
సంపూర్ణాధికారం ఎవరిది?
కొత్త సిజెఐ జస్టిస్ గవాయ్ త్వరలోనే దీనిపై
రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం

శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులు గవర్నర్లు Governor) ఆమోదం తెలపకుండా కాలయాపనచేయడం, రాష్ట్రపతి (President) పరిశీలనలో ఉన్నవీ తీవ్రజాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ అంశంలో గవర్నర్(Governor) తోపాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై ప్రథమ పౌరురాలు అయిన ద్రౌపది ముర్ము స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్యాంగంలోని 143 అధికరణం కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది.

Droupadi Murmu: ఎవరు సుప్రీం?
Droupadi Murmu: ఎవరు సుప్రీం?

త్వరలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ బిఆర్గావాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజ్యాంగంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను 142వ అధికరణం కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీచేస్తుంది. సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాష్ట్రపతి,
రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
గవర్నర్ల కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి. రాజ్యాంగంలోని 200వ అధికరణం కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్నరాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? 201 అధికకరణం కింద రాష్ట్రపతి, 200కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్దమేనా అని ప్రశ్నలువేసారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ వి ఆమోదించకుండా తనవద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి
సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా మూడునెలల్లోగా ఆమోదించడమో లేక తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్రప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జతచేయాలని తెలిపింది. ఈ
తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యంచేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని గవర్నర్ల నిష్క్రియాపరత్వంపై న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగంలోని 142వ అధికరణంద్వారా అటువంటి సంపూర్ణ అధికారాలు సుప్రీంకోర్టు ఉందని జస్టిస్
జెబి పారీధవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతోకూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది.

Read Also: TURKEY: తుర్కియేకు భారత్ షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870