నిరుద్యోగ గణాంకాలను దేశంలో ఇప్పటి వరకూ త్రైమాసిక, వార్షిక వారీగా కేంద్రం విడుదల చేస్తోంది. అయితే, తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటు గణాంకాలను గురువారం వెల్లడించింది. కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)’ ప్రకారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. దేశంలోని ఉద్యోగాలకు అర్హత కలిగిన 15 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో, నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనేది సత్వరం తెలియజేయడమే ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం కరెంట్ వీక్లీ స్టేటస్ (CWS) విధానంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం,దేశంలో 15 ఏళ్లు పైబడినవారిలో నిరుద్యోగిత రేటు 2025 ఏప్రిల్‌లో ‘5.1%’గా నమోదైంది.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.5% ఉండగా, పట్టణ కేంద్రాల్లో 6.5%గా నమోదయ్యింది. ఈ ఏడాది జనవరి నుంచి PLFS పునరుద్ధరించారు. ఇప్పుడు మొదటిసారి నెలవారీ బులెటిన్ రూపంలో ఉద్యోగ గణాంకాలను విడుదల చేస్తోంది. ఈ గణాంకాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై వేర్వేరు వివరాలను పొందుపరిచారు. 15 సంవత్సరాలు పైబడిన పురుషుల్లో నిరుద్యోగిత రేటు(Unemployment Rate) 5.2%గా ఉంటే అమ్మాయిల్లో అది 5.0%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు 4.9%, మహిళలు 3.9% అయితే పట్టణ ప్రాంతాల్లో మహిళలు 8.7%, పురుషులు 5.8%గా ఉన్నారు. కాగా, దేశంలో యువత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతోన్న ఘటనలు తరుచూ సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్నాయి.ఓ కంపెనీలో 10 ఉద్యోగాలకు వందల మంది హాజరైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

గణాంకాలు
దేశవ్యాప్తంగా యువ నిరుద్యోగులు 13.8% ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. విడిగా చూస్తే పట్టణాల్లో 23.7% గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతంగా ఉంది.గ్రామీణ మహిళలు 14.4%, పురుషులు 13.6%.15 ఏళ్లు, ఆపై వయసున్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) ఏప్రిల్‌లో 55.6 శాతంగా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 58%, పట్టణాల్లో 50.7 శాతంగా కనిపించింది. వీరిలో గ్రామీణ పురుషులు 79.0%, పట్టణాల్లో పురుషులు 75.3%మొదటి దశలో 7,500 ప్రాంతాలను నమూనాగా తీసుకుని,89,434 నివాసాల్లో సర్వే నిర్వహించారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 49,323 పట్టణ ప్రాంతాల్లో 40,111 మొత్తం 3,80,838 మందిని సర్వే (గ్రామీణులు 2,17,483.. పట్టణాలు 1,63,355) చేశారు.
Read Also : Operation sindoor: ‘భవిష్యత్తు యుద్ధంలో డ్రోన్లు, స్పేస్, సైబర్‌స్పేస్ పాత్ర కీలకం’