కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమీపంలోని భూముల్లో చెట్లను నరికివేడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. చెట్లను నరికివేయొద్దని జేసీబీలకు అడ్డంగా వెళ్లి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర వివాధం నెలకొంది. అప్పుడు పోలీసులు విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ వివాదం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఐటీపార్క్(IT Park) అభివృద్ధి కోసం చెట్లను నరికివేయండం సరికాదని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లను నరికారు, అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు వ్యాఖ్యానించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.జూలై 23 కల్లా ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే సీఎస్(CS) సహా కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. తదరుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.

ధర్మాసనం
అలాగే విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల విషయంలో ప్రత్యేకంగా మరో పిటీషన్‌ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలపకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి(State Government) సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు యధాస్థితి కొనసాగించాలని పేర్కొంది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా వందల ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలంది. ఈ క్రమంలో గత విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీం కోర్టుకు సీఈసీ మధ్యంతర నివేదికను అందజేసింది.
Read Also: Hyderabad: అనుమానంతో భార్యను దారుణంగా హతమార్చిన భర్త