తమిళ్ లో సూరి ప్రస్తుతం డిఫరెంట్ జానర్లను టచ్ చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. సూరి కామెడీ పాత్రలను వదిలి హీరోగా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సంతానం అయితే కామెడీ హీరోగా మారిపోయాడు. ఇక సూరి మాత్రం సీరియస్ రోల్స్‌తో మెప్పిస్తున్నాడు. విడుదల, విడుదల 2 విషయంలో సూరి నటన అందరినీ కట్టి పడేస్తుంది. ఇక ఇప్పుడు మళ్లీ సూరి ఓ సీరియస్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మే 16న సూరి, ఐశ్వర్య లక్ష్మీ నటించిన మామన్ అనే చిత్రం కోలీవుడ్(Kollywood)లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సూరి, ఐశ్వర్య లక్ష్మీలు ప్రమోషన్స్లోసందడి చేస్తున్నారు. హీరోగా మారడంపై నాని తనను ప్రశంసించాడని సూరి చెప్పుకొచ్చాడు. కీర్తి సురేష్ పెళ్లిలో నానిని సూరి కలిశాడట. కామెడీ రోల్స్ వదిలేసి సీరియస్ రోల్స్‌తో హీరోగా మారడం ఆనందంగా, సంతోషంగా ఉందని, నిజాయితీతో కూడిన కథల్ని చెబుతున్నావ్ అని నాని(Nani) ప్రశంసించాడట.అయితే కమెడియన్లు హీరోగా మారితే ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. మన తెలుగులోనూ ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా ట్రై చేశారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారన్న సంగతి తెలిసిందే. అలాంటి వారి చిత్రాలకు బడ్జెట్లు దొరకవు.. హీరోయిన్లు లభించరు. ఇక మన సునిల్, సప్తగిరి వంటి వారు హీరోలుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో అలీ అయితే యమలీల అంటూ హిట్టు కొట్టాడు. కానీ ఆ తరువాత మళ్లీ కమెడియన్‌గానే సెటిల్ అయిపోయాడు.

లక్షణాలన్నీ
ఇక ఇప్పుడు సూరి మామన్ చిత్రంతో అయితే మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi)చేసిన ఈ కామెంట్లు బాగానే వైరల్ అవుతున్నాయి.సూరితో నటిస్తున్నావ్? ఓకేనా? అని అంతా అడుగుతున్నారట. సూరితో నటిస్తే ఏం? అతనికేం తక్కువ స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని, అతనికి స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయని, సూరితో నటించడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.సూరి, సుహాస్(Suri, Suhas) కలిసి మండాడీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో సూరి తమిళ వర్షెన్‌లో హీరోగా ఉంటాడట. సుహాస్ ఏమో తెలుగు వర్షెన్కు హీరోగా ఉంటాడట. అలా రెండు వర్షెన్స్ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చే ఆలోచనల్లో టీం ఉందట.
Read Also: Rajamouli : ఆర్ఆర్ఆర్ 2 సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి