हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

Anusha
Andhra Pradesh: ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

ఏపీ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని చేపట్టింది,భవనాలతో పాటుగా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. అమరావతితో పాటుగా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్ని వేగవంతం చేసింది,అలాగే నగరానికి పలు ఐటీ కంపెనీలతో పాటుగా పరిశ్రమల్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈ క్రమంలో విశాఖపట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం,సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోంది. అమరావతికి రింగ్ రోడ్డు నిర్మించిన విధంగానే విశాఖకు కూడా ఒక రింగ్ రోడ్డు ఉండాలని భావిస్తున్నారు. సముద్రం, కొండలు అడ్డంకిగా ఉండటంతో పూర్తి రింగ్ రోడ్డు సాధ్యం కాదు కాబట్టి సెమీ రింగ్ రోడ్డు(semi-ring road)ను ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలోనే ఆదేశించారు. ఈ మేరకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.విశాఖపట్నంలో నేషనల్ హైవే ఉంది.విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు కేంద్రం కోస్టల్ కారిడార్(Coastal Corridor) ప్రతిపాదన చేసింది. ఇది సెమీ రింగ్ రోడ్డులో సగం అవుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలింది రింగ్ రోడ్డును అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద మొదలుపెట్టి తాళ్లపాలెం, అనకాపల్లి మీదుగా కొత్తవలస ద్వారా విజయనగరం నుండి భోగాపురం కలుపుతూ ఏర్పాటు చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి, విశాఖపట్నం పట్టణాలను టచ్ చేయకుండా అటు వైపుగా విజయనగరం మీదుగా భోగాపురం వరకు రోడ్డు వెళ్తుంది.

Bridge 02
ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

రింగ్ రోడ్డు

ఈ మేరకు సెమీ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, పొడవు, వెడల్పు, భూములు, బ్రిడ్జిల నిర్మాణంపై అధ్యయనం కోసం వీఎంఆర్‌డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరతామని ఆ తర్వాత దానిని ప్రభుత్వానికి సమర్పిస్తామని చెబుతోంది వీఆర్ఎండీఏ(VRMDA). ఈ ప్రతిపాదిత సెమీ రింగ్ రోడ్డు (ఎస్‌ఆర్‌ఆర్‌) అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకు వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఇది ఆరు వరుసల్లో ఉంటుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగవంతం అయ్యాయి.ఈ క్రమంలో ఈ సెమీ రింగ్ రోడ్డును అక్కడి వరకు ప్లాన్ చేస్తున్నారు. నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు కూడా కనెక్టివిటీ ఉంటుందని చెబుతున్నారు.

Read Also : Andhra Pradesh: ఆలూరు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో ఊహించని ట్విస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870