ఆమె పేరు లక్ష్మీనరసమ్మ,అనుకోని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురంలో చోటు చేసుకుది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు.ఇక వారి కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల కోసం వారం రోజుల క్రితమే లక్ష్మీనరసమ్మ(Lakshmi Narasamma) కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. అయితే అనుకోకుండా పెళ్లికి సమయం దగ్గర పడుతున్న వేళ లక్ష్మీనరసమ్మ బంధువు ఒకరు చనిపోయారు.దాంతో పెళ్లి వాయిదా వేశారు.రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో ఇలానే లక్ష్మీ నరసమ్మ వివాహం ఆగిపోయింది. మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.పెళ్లి వాయిదా పడిందన్న బాధలో ఉన్న లక్ష్మీ నరసమ్మ,తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ జన్మలో తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మానసిక ఒత్తిడి
నవ మాసాలు మోసి ప్రాణం పోతుందని తెలిసినా పురిటి నొప్పులను భరించి మరీ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఇక జీవితాంతం బిడ్డలకు ఏ కష్టం రాకుండా తండ్రి కాపు కాస్తాడు. మరి పిల్లలే ప్రాణంగా బతికే ఆ తల్లిదండ్రులు తమ కళ్ల ఎదురుగానే బిడ్డలు కన్ను మూస్తే ఎంత బాధపడతారు. వారి కడుపుకోతను తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. ఇక మరి కొందరైతే చాలా చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుని కన్న వాళ్ల గుండెల్లో ఆరని చిచ్చు రగిలిస్తారు. వారు బతికున్నంత కాలం ఆ బాధను మోయాల్సిందే. కన్నవాళ్లకు తీరని కడుపుకోత మిగిల్చిందిలక్ష్మీ నరసమ్మ. మానసిక ఒత్తిడిని(Mental stress) తక్కువగా భావించకూడదు. వ్యక్తిగత సమస్యలు ఎంత చిన్నవిగా అనిపించినా, ఆ బాధలో ఉన్న వ్యక్తికి అవే ప్రపంచంగా మారుతాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు దగ్గరగా ఉండి ధైర్యం చెప్పడం అవసరం.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మనం చైతన్యవంతంగా ఉండాలి. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. చిన్న సమస్యలను కూడా పెద్దగానూ తీసుకుని, అనవసరంగా ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకరం.
Read Also :Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్ ఎక్కడంటే?