జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం సంఘటన తర్వాత భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి.ఇటీవల భారత్ చేసిన మెరుపుదాడులతో పరిస్థితి మరింత భీకరంగా మారింది. ఇరు దేశాల పరస్పరం దాడులు చేసుకోవడం కనిపించింది. పాక్ దాడులను భారత సేనలు గట్టిగా తిప్పి కొట్టడంతో ప్రత్యర్థి సేనలు బెంబెలెత్తాయి. దాంతో కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌పై ఆర్జీవీ చేసిన కామెంట్ వైరల్ అయింది.రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించేవారు. కాని ఇప్పుడు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలు తీసిన కూడా కాంట్రవర్సీనే. ట్వీట్ చేసిన కాంట్రవర్సీనే. ట్రంప్ ట్వీట్‌కి సెటైరికల్‌గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
సమయంలో
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పహల్గాంలో 26 మంది పర్యాటకులని ఉగ్రవాదులు కిరాతకంగా చంపేయడంతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది.భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.భీకర దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై పూర్తిగా, తక్షణంగా అంగీకరించాయని ప్రకటించారు. ఇది తన మద్యవర్తిత్వ విజయంగా ఆయన తెలియజేశారు, రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల సంతోషిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చాలా బాగా అర్ధం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు కూడా తెలియజేశారు. ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్, పాకిస్తాన్‌కు ధన్యవాదాలు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్వీట్
ఈ ట్వీట్ పట్ల ఆర్జీవీ స్పందిస్తూ నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ కాని తెలివి కాని లేవా? నువ్వు వచ్చి మాకు నేర్పిస్తున్నావా? అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ(Ram Gopal Varma) ట్వీట్ వైరల్‌గా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి సుదీర్ఘంగా మొత్తం జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో తెలియజేశారు. అయితే కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన మాట తప్పింది.ది.మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్ రాజస్తాన్‌లోని జైసల్మేర్, బర్మేర్‌లలో బ్లాక్‌అవుట్ విధించారు. గుజరాత్‌లోని కచ్‌లో డ్రోన్లు కలకలం రేపాయి.
Read Also :Director: లిక్టన్‌స్టైన్ దేశాన్ని ఒకరోజుకి అద్దెకి తీసుకోవచ్చు: పూరి జగన్నాథ్