భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్, పాక్ మధ్య ఇప్పుడు సీజ్ఫైర్ ఉంది. అంటే ఎవరు కాల్పులు జరపకూడదు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ గురించి ప్రకటించాయి. అయితే తాజాగా ట్రంప్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్ అన్నారు. రెండు దేశాల్లో శక్తిమంతమైన, అచంచలమైన నాయకత్వాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉందన్న ట్రంప్ అన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం పెంచుకుంటామని కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించించడం విశేషం. రెండు దేశాల నాయకత్వాలు గొప్ప పనిచేశాయని ట్రంప్(Donald trump) కితాబిచ్చారు.అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి సుదీర్ఘంగా మొత్తం జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్ శనివారం ప్రకటించారు. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల సంతోషిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చాలా బాగా అర్ధం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్, పాకిస్తాన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

సరిహద్దు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్థాన్ కూడా భారత్‌పై సైనిక చర్యకు దిగంది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది. అయితే ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి స్పందించారు. అయితే ఈసారి స్వయంగా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడం, దానికి సంబంధించిన ప్రకటన చేయడం విశేషం.
Read Also: China: కాల్పుల ఉల్లంఘన అనంతరం పాక్ కు చైనా మద్దతు