हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి రోహిత్ మంచి పని చేసాడు: సంజయ్ మంజ్రేకర్

Anusha
Sports: టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి రోహిత్ మంచి పని చేసాడు: సంజయ్ మంజ్రేకర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన నేపథ్యంలో, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పనైపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి రోహిత్ శర్మ మంచి పనిచేశాడని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతని రిటైర్మెంట్‌పై స్పందించిన మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా అతని పనైపోయిందని, దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని ట్వీట్ చేశాడు.రోహిత్ శర్మ పనైపోయింది. టెస్ట్ ఫార్మాట్‌లో గత 15 ఇన్నింగ్స్‌ల్లో అతను 164 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 10 పరుగులు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 10.9 మాత్రమే. అతని ప్రస్తుత ఫిట్‌నెస్ స్థాయిలను పరిశీలిస్తే టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ కథ ముగిసింది.’అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.సెలెక్టర్లు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆటగాడి ఎంపిక చేయలేమని చెప్పడంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.

 Sports: టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి రోహిత్ మంచి పని చేసాడు: సంజయ్ మంజ్రేకర్
రోహిత్ మంచి పని చేసాడు: సంజయ్ మంజ్రేకర్

హాఫ్ సెంచరీ

రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌లో 67 మ్యాచ్‌ల్లో 116 ఇన్నింగ్స్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212. పరిమిత ఓవర్ల తరహాలో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ గొప్పగా సాగలేదు. 2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లోనే 177 పరుగులు చేశాడు. తన రాకను ఘనంగా చాటుకున్నా ఆ జోరు కొనసాగించలేకపోయాడు.రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో తదుపరి టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పేర్లు వినిపిస్తున్నాయి. సెలెక్టర్లు మాత్రం విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Read Also :Sports: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను బుమ్రాకు ఇవ్వాలి:మదన్ లాల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870