हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Andhra Pradesh: ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు

Anusha
Andhra Pradesh: ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహన్‌రావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఆయన తహసీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనను తహసీల్దార్‌ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది. గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలు తొలగించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను పరిగణలోకి తీసుకుని, ఆయన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. తాతా మోహన్‌రావు 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించారు. ఈ తొలగింపు సమయంలో హైకోర్టు హెచ్చరికలను ఆయన పట్టించుకోలేదు. దీంతో హైకోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధించింది దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించిన సుప్రీంకోర్టు,(Supreme Court) ఆయనను డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తహసీల్దార్‌ స్థాయికి తగ్గించాలని ఆదేశించింది. 2013 లో గుడిసెలు తొలగింపు అంశంపై హైకోర్టు 2015 మార్చి 27న మోహన్‌రావుకు రెండు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. దీనిపై మోహన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ప్రభుత్వ భూమిని కాపాడటానికే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నానని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన ఉద్యమం జరుగుతోందని, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు సరిగా లేవని, అందుకే రాత్రికి రాత్రే వేసుకున్న గుడిసెలను తొలగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 48 గంటల కంటే ఎక్కువ జైలు శిక్ష విధిస్తే మోహన్‌రావు ఉద్యోగం పోతుందని.దాని వల్ల ఆయన కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. పిల్లల చదువులు కూడా ఆగిపోతాయని తెలిపారు.

కామెంట్స్

గుడిసెలను తొలగించి అందులో నివాసం ఉంటున్నవారిని రోడ్డు మీదికి తోసేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది అని ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది. మోహన్‌రావును(Mohan Rao) జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుందని, ఆయన మొండితనం, నిర్లక్ష్య వైఖరి వల్ల కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే జైలు శిక్షపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిపింది. అయితే, ఎవరైనా చట్టానికి అతీతులు కారని చాటి చెప్పాలనుకుంటున్నామన్నారు. హైకోర్టు విధించిన శిక్షను సవరిస్తూ, మోహన్‌రావును డిప్యూటీ కలెక్టర్‌ పదవి నుంచి తహసీల్దార్‌ పోస్టుకు డిమోట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నామన్నారు.

 Andhra Pradesh: ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇంక్రిమెంట్ల

పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా మా సూచనను అంగీకరించకపోతే మేం ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం. ఇలాంటి ఉత్తర్వులిచ్చేటప్పుడు మాకూ బాధ ఉంటుంది. కానీ నిస్సహాయులం’ అన్నారు. అలాగే ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు రూ.లక్ష జరిమానా చెల్లించాలని, ఆ రసీదును కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి పదోన్నతుల(Promotions)కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జైలు శిక్ష తప్పించుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తగ్గి తహసీల్దార్‌ పదవి చేపట్టడానికి అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని గతంలో కోర్టు సూచించింది. అయితే మోహన్‌రావు అంగీకరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Pawan Kalyan : భారత సైన్యంకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పిలుపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870