మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది రోజూ మనం తీసుకునే ఆహారం, మందులు, వాతావరణ కాలుష్యం ద్వారా వచ్చే అనేక రసాయనాలను ఫిల్టర్ చేసి, శరీరాన్ని విషపదార్థాల నుంచి కాపాడుతుంది. కాలేయం లేకుండా మన శరీరంలో జీవక్రియలు జరిగే మార్గమే ఉండదు. ఈ నేపథ్యంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యవసరం.

కాలేయం చేసే ముఖ్యమైన పనులు:
రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, జీర్ణక్రియకు అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడం, శక్తిని నిల్వ చేయడం (గ్లైకోజన్ రూపంలో), కొలెస్ట్రాల్, హార్మోన్లు, ఎంజైములు ఉత్పత్తి చేయడం.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు:
పసుపు (Turmeric)
పసుపులో ఉండే కర్కుమిన్ అనే సంయోగం అత్యుత్తమ యాంటీఆక్సిడెంట్. ఇది కాలేయంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడమే కాకుండా, పాతకాలేయ కణాలను తిరిగి క్రియాశీలం చేయడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు పసుపు కలిపిన పాలుతో ప్రారంభించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరికాయ (Amla)
ఉసిరిలో ఉన్న విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను oxidative stress నుండి రక్షిస్తాయి. ఇది సహజమైన డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.
వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లిలో ఉండే అలిసిన్ మరియు సెలీనియమ్ అనే సమ్మేళనాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది కాలేయంలో డీటాక్స్ ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది.

తులసి (Tulsi/Basil)
తులసి ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నట్టే, ఆరోగ్య పరంగా కూడ రక్తం మరియు కాలేయం శుభ్రపరచడంలో సహాయపడుతుంది. తులసి టీ, లేదా తులసి ఆకులను నమలడం వల్ల కాలేయానికి మంచి జరుగుతుంది.
వాము (Ajwain)
వాము జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కాలేయానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది bloating, acidity వంటి సమస్యలను తగ్గిస్తుంది.
కొత్తిమీర (Coriander)
కొత్తిమీరలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఇది సహజమైన డీటాక్స్ ప్రక్రియకు తోడ్పడుతుంది.

నివారించాల్సిన పదార్థాలు:
మద్యం (Alcohol)
అధిక మద్యం వినియోగం కారణంగా ఫ్యాటీ లివర్, అల్కహాలిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. WHO గణాంకాల ప్రకారం ప్రపంచంలో కాలేయ సంబంధిత మరణాల్లో మద్యం ముఖ్య కారణం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు (Processed Foods)
చిప్స్, బర్గర్లు, నూడుల్స్ వంటి ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌లు కాలేయంపై ప్రభావం చూపిస్తాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
అధిక చక్కెరలు (Added Sugars)
బాటిల్ డ్రింకులు, స్వీట్ మిఠాయిలు, కేకులు మొదలైన వాటిలో ఉండే అధిక చక్కెర శరీరంలో ఇన్సులిన్‌కు ప్రతికూలంగా పనిచేస్తుంది. ఇది నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు దారితీస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సూచనలు:
రోజుకి కనీసం 2–3 లీటర్లు నీరు తాగాలి, వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలి. అవసరమైనవే తప్ప మందులను సొంతంగా వాడవద్దు. రెగ్యులర్‌గా లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) చేయించుకోవాలి.
Read also: Health: క్యాన్సర్ ని ఆమడదూరం ఉంచే పనస