ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది.గెలిస్తే గానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సత్తాచాటడంలో విఫలమైంది. ఫలితంగా ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. సొంత ఇలాఖాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) 2 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సీఎస్కే వెళుతూ వెళుతూ కోల్‌కతా అవకాశాలకు ఘోరంగా గండికొట్టింది.లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన కేకేఆర్ ఐదింటిలో గెలిచి, ఆరింటిలో ఓడి ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా మిగతా జట్ల గెలుపు, ఓటములపై కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక చెన్నై విషయానికొస్తే 2018 తర్వాత 180కి పైగా పరుగుల లక్ష్యాన్ని తొలిసారి ఛేదించిన చెన్నై ఈ సీజన్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత నూర్ అహ్మద్(4/31) ధాటికి కోల్‌కతా 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. కెప్టెన్ రహానే(33 బంతుల్లో 48, 4ఫోర్లు, 2సిక్స్‌లు), రస్సెల్(21 బంతుల్లో 38, 4ఫోర్లు, 3సిక్స్‌లు), మనీశ్‌పాండే(36 నాటౌట్) రాణించారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 183/8 స్కోరు చేసింది. బ్రెవిస్(25 బంతుల్లో 52, 4ఫోర్లు, 4సిక్స్‌లు) సుడిగాలి అర్ధసెంచరీతో చెలరేగగా, శివమ్ దూబే(45) విలువ చాటుకున్నాడు. వైభవ్ అరోరా(3/48)మూడు వికెట్లు తీయగా, రానా(2/43), వరుణ్(2/18) రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
బౌలింగ్
టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై పడుతూ లేస్తూ సాగుతున్న కేకేఆర్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. రెహ్మనుల్లా గుర్బాజ్(11) మరోమారు విఫలం కాగా,(Sunil Narine) సునీల్ నరైన్(26), రహానే(48) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు కలిసి చెన్నై బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో నరైన్ రెండు ఫోర్లకు తోడు సిక్స్‌తో చెలరేగడంతో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో కంబోజ్ను లక్ష్యంగా చేసుకుంటూ రహానే 6, 4 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి కేకేఆర్ 67/1 స్కోరు చేసింది. అయితే స్పిన్నర్ నూర్ అహ్మద్ రంగప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో నూర్ అహ్మద్ నరైన్‌తో పాటు రఘువంశీ(1)ని ఔట్ చేసి కోల్‌కతాను కష్టాల్లోకి నెట్టాడు. ఇక్కణ్నుంచి కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఇదే అదునుగా రహానే(Rahane) కూడా ఔట్ కావడంతో కోల్‌కతాను మరింత దెబ్బతీసింది. రస్సెల్ తనదైన శైలిలో బ్యాటు ఝులిపించడంతో మళ్లీ గాడిలో పడింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో నూర్ అహ్మద్ రస్సెల్‌ను ఔట్ చేసి చెన్నై శిబిరంలో ఆనందం నింపాడు. భారీ షాట్లు ఆడుతాడనుకున్న రింకూసింగ్(9) కూడా నూర్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మనీశ్ పాండే విలువైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు పోరాడే స్కోరు దక్కింది.

బౌలింగ్
అరంగేట్రం కుర్రాడు ఉర్విల్ పటేల్(11 బంతుల్లో 31, ఫోర్, 4సిక్స్‌లు) ఉరుములా విరుచుకుపడ్డాడు. ఆడుతున్నది తొలి మ్యాచ్ అయినా , కోల్‌కతా బౌలర్లను చితక్కొట్టాడు. భారీ షాట్ ఆడే క్రమంలో రానా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్(8) ఇలా వచ్చి అలా వెళ్లాడు. దీంతో చెన్నై ఓటమి ఇక ఖాయమనుకుంటున్న తరుణంలో బ్రెవిస్ ధనాధాన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. అరోరా వేసిన 11వ ఓవర్లో బ్రెవిస్ మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 22 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో సమీకరణం మొత్తం మారిపోయింది. బ్రెవిస్ ఔటైనా దూబే కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ ధోనీ(17 నాటౌట్) ఫినిషర్ పాత్ర పోషించాడు.
Read Also :IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ను వీడనున్న నితీష్ రాణా