రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.విరాట్ కోహ్లీ ఓ పెద్ద జోకర్ అని, అతని ఫ్యాన్స్ అతని కంటే పెద్ద జోకర్లు అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.విరాట్ కోహ్లీ తనను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బ్లాక్ చేశాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై నెట్టింట దుమారం రేగుతోంది. రాహుల్ వైద్యపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు.ఇటీవల విరాట్ కోహ్లీ ఆట తీరుపై రాహుల్ వైద్య సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ‘ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. అతని నెమ్మదైన బ్యాటింగ్ జట్టుకు నష్టం కలిగిస్తుంది. పవర్ ప్లే తర్వాత కోహ్లీ వేగంగా ఆడలేకపోతున్నాడు. దాంతో ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది.ఇది జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుంది. కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకొని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. జట్టులో కుర్రాళ్లకు అవకాశమిచ్చి ప్రోత్సహించాలి.’అని రాహుల్ వైద్య అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగతంగా కోహ్లీని విమర్శించడం లేదని, కేవలం జట్టు ప్రయోజనాల దృష్ట్యా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశాడు. కోహ్లీ గొప్ప ఆటగాడని, కానీ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు తన ఆటను మార్చుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అవనీత్ కౌర్ హాట్ ఫొటోను లైక్ చేయడంపై కోహ్లీ ఇచ్చిన వివరణను గేలి చేశాడు.

విమర్శలు
రాహుల్ వైద్య తీరుపై ఆర్‌సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ ఎప్పుడు ఎలా? ఆడాలో బాగా తెలుసని, అతని జట్టు కోసమే నెమ్మదిగా ఆడుతున్నాడని కౌంటరిచ్చారు. ఈ క్రమంలో అతనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగారు. పాటలు పాడేవాడు కూడా ఆట గురించి మాట్లాడుతున్నాడని సెటైర్లు పేల్చారు. రాహుల్ వైద్య కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు గుప్పించారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్ వైద్య’కోహ్లీ కంటే అతని అభిమానులు పెద్ద జోకర్లు’అని స్టోరీగా పెట్టాడు. దాంతో మరోసారి ఆర్‌సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.రాహుల్ వైద్య ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్. ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ తొలి సీజన్ రన్నరప్. బిగ్ బాస్ 14లో రన్నరప్‌గా నిలిచాడు. కొన్ని హిందీ రియాలిటీ షోలో పాల్గొనడంతో పాటు వాటికి హోస్ట్‌గా వ్యవహరించాడు. బాలీవుడ్ సినిమాలకు పాటలు పాడటంతో పాటు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రూపొందించాడు. లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రముఖ సింగర్‌గా గుర్తింపు పొందాడు.
Read Also :IPL 2025: కోహ్లీ, రోహిత్ పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు?