हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Guinness Book: గిన్నీస్ రికార్డు కి ఎక్కిన శోభన్ బాబు మనవడు

Anusha
Guinness Book: గిన్నీస్ రికార్డు కి ఎక్కిన శోభన్ బాబు మనవడు

తెలుగు సినీ లోకంలో శోభన్ బాబు అనే పేరు ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోయింది. ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకుల మనసులో మిగిలేలా చేస్తాయి. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఈ లోకంలో లేకపోయినా, ఆయన కళా వారసత్వం తెలుగు సినీ ప్రపంచంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి పరిచయం చేయలేదు.అయితే ఆయన వారసులు ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును మరో కోణంలో వెలిగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సర్జరీలు

పదివేలకు పైగా సర్జరీలు చేయడం, అన్నీ సక్సెస్ అవ్వడంతో డాక్టర్ సురక్షిత్ ట్రాక్ రికార్డ్. ఇక సురక్షిత్‌ను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించింది. శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన 8 గంటలు శ్రమించి మహిళకు శస్త్ర చికిత్స చేసి గర్భాశయంలోని పెద్ద కణితిని తొలగించారు. ఇప్పటికే ఎన్నో వేల సర్జరీలు చేసి సక్సెస్ అయ్యారు. దీనిపై సురక్షిత్ స్పందించారు. ఇలాంటి చికిత్స ఇంకెక్కడా జరగలేదని ఆయన అన్నారు. మామూలుగా అయితే ఈ సర్జరీ కోసం చాలా త్రీడీ ల్యాపరోస్కోపీని వాడరని అన్నారు. చాలా మంది రిస్క్‌తో కూడుకున్నదని, ఖర్చుతో కూడుకున్నదని ఈ విధానాన్ని ఉపయోగించరని అన్నారు.8 గంటలు శ్రమించి చికిత్స చేసి సక్సెస్ అయ్యామని చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రమే పేషెంట్‌ని డిశ్చార్జ్ కూడా చేశామని చెప్పుకొచ్చారు. ఇలాంటి రిస్కీ సర్జరీలు చేయడంలో తన గురువు డాక్టర్ రాకేష్ సిన్హా దిట్ట అని చెబుతున్నాడు. ఆయన ఒక సారి ముంబైలో 4.1 కిలోల కణతిని తీసి రికార్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు తాను 4.5 కిలోల కణతిని తీసి ఆ రికార్డుని బ్రేక్ చేశానని సురక్షిత్ చెప్పుకొచ్చారు.

 Guinness Book: గిన్నీస్ రికార్డు కి ఎక్కిన శోభన్ బాబు మనవడు

పిండం

శోభన్ బాబు మనవడిగా సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే పది వేలకు పైగా సర్జరీలు చేసి అన్నింట్లోనూ విజయం సాధించడం విశేషం. ఒకసారి ఇలానే ఓ మహిళ రెండో సారి గర్భం దాల్చిందట. అయితే ఆ గర్భం పగిలిపోయిందట. పిండం పొట్టలోకి జారిపోయిందట. మామూలుగా అయితే ఆ పిండాన్ని బయటకు తీసి మహిళ ప్రాణాలు మాత్రమే కాపాడగల్గుతారట. కానీ ఆ మహిళ మాత్రం బిడ్డని కూడా బతికించమని కోరిందట.దీంతో మళ్లీ ఆ పిండాన్ని గర్భంలోనే పెట్టి సర్జరీ చేశారట. ఇప్పుడు తన పిల్లలతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. త్రీడీ ల్యాపరోస్కోపిక్ వ్యవస్థను చెన్నైలోకి సురక్షిత్ తీసుకు వచ్చారని చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన కుటుంబం అంతా కూడా వైద్య వ్యవస్థలోనే ఉన్నారు. అతని కోడలు డాక్టర్ శ్రీలత కూడా వైద్య రంగంలో రాణిస్తున్నట్టుగా సమాచారం. సురక్షిత్‌కు ఇప్పటికే 40పైకి అవార్డులు వచ్చినట్టు తెలుస్తోంది.

Read Also :Singer: సింగర్ సోనూ నిగమ్ పై కేసు నమోదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870