దేశంలోని ప్రముఖ నాలుగు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. అయితే ఈ మొత్తం జరిమానా చూస్తే రూ. 2.52 కోట్లుగా వెల్లడైంది. గత శుక్రవారం అంటే 2 మే 2025న అన్ని బ్యాంకులలో అతి పెద్దదైన రిజర్వ్ బ్యాంక్ ఈ ఐదు కీలక బ్యాంకులపై జరిమానాలు విధించినట్లు తెలిపింది. జరిమానా విధించిన 5 బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. ప్రస్తుతం దీని వెనుక ఉన్న కారణం వెలుగులోకి వచ్చింది.
యాక్సిస్ బ్యాంక్ పై విధించిన జరిమానా
ప్రైవేట్ సెక్టార్ యాక్సిస్ బ్యాంక్‌పై RBI రూ.29.60 లక్షల జరిమానా విధించింది. ‘ఇంటర్నల్ / ఆఫీస్ అకౌంట్స్ ఆన్ ఆఫీషియల్ అసిటివిటిస్ ‘పై RBI జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29 ఏప్రిల్ 2025 నాటి ఉత్తర్వు ద్వారా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 29.60 లక్షల జరిమానా విధించిందని నోటీసులో పేర్కొంది.

ICICI బ్యాంక్ పై జరిమానా
‘బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్’, ‘నో యువర్ కస్టమర్ (KYC)’, ‘క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ – ఇష్యూన్స్ అండ్ కండక్ట పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు అపెక్స్ బ్యాంక్ ICICI బ్యాంక్‌పై రూ. 97.80 లక్షల జరిమానా విధించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.61.40 లక్షల జరిమానా పడింది. బ్యాంకులు అందించే ఆర్థిక సేవలు అలాగే బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ పై కొన్ని సూచనలను పాటించనందుకు RBI ఈ జరిమానా విధించినట్లు నోటీసు ద్వారా తెలిపింది. కొన్ని ఆదేశాలను పాటించనందుకు ఈ జరిమానా విధించినట్లు RBI ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: NEET 2025 : నీట్ పరీక్షలో కఠినంగా బయాలజీ ప్రశ్నలు