हिन्दी | Epaper
అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

Marriage: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

Anusha
Marriage: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

పాక్ మహిళను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ -సీఆర్పీఎఫ్‌ జవాన్‌కు పెద్ద శిక్షే పడింది. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో అతని ఉద్యోగమే ఊడింది. సీఆర్పీఎఫ్ అంటే భారత సైనిక దళాలకు చెందింది కాగా అక్కడ పనిచేసే వారు శత్రుదేశంతో సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం ఉపేక్షించరాని విషయం. దీంతో పాకిస్తాన్‌ మహిళను పెళ్లి చేసుకున్న ఆ సీఆర్పీఎఫ్ జవాన్ ఏరి కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అయింది. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగగా పాక్ వాసుల వీసాలను రద్దు చేసిన భారత్ వారు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.సీఆర్పీఎఫ్‌ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్ అహ్మద్‌ అనే జవాన్‌ రెండున్నర నెలల కిందట పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్‌‌కు చెందిన మినాల్ ఖాన్‌తో మునీర్ అహ్మద్‌కు ఆన్‌లైన్‌లో పెళ్లయింది. పెళ్లి తర్వాత మునీర్ అహ్మద్ విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చింది. అనంతరం దీర్ఘకాలిక వీసా కోసం మినాల్ ఖాన్‌ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఇక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ అయిన తన భర్త మునీర్ అహ్మద్‌తో కలిసి మినాల్ ఖాన్ జమ్మూలో నివసిస్తోంది.

అధికారులు

కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ వాసుల వీసాలను భారత్‌ రద్దు చేసింది. దీంతో వీసా గడువు ముగిసిన పాక్‌ మహిళ మినాల్ ఖాన్‌ను దేశం నుంచి వెళ్లిపోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల ఆదేశాలతో పాక్‌ తిరిగి వెళ్లేందుకు తన భర్త మనీర్ అహ్మద్‌తో కలిసి మినాల్ ఖాన్ జమ్మూ నుంచి పంజాబ్‌లోని అట్టారి సరిహద్దు వద్దకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లే చివరి క్షణంలో జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు ఆమెకు భారీ ఊరటను ఇచ్చింది. ఆమెకు దేశ బహిష్కరణ నుంచి విముక్తి కల్పించింది.మినాల్ ఖాన్‌ను అట్టారి నుంచి జమ్మూకు పంపించాలని ఏప్రిల్‌ 30వ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం కాస్తా సీఆర్పీఎఫ్‌ అధికారులకు తెలిసింది. జవాన్‌ మునీర్ అహ్మద్‌కు పాక్‌ మహిళ మినాల్ ఖాన్‌తో పెళ్లి జరిగినట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఈ వివాహాన్ని దాచినందుకు అతడ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ ప్రకటించింది. జవాన్‌ అహ్మద్ మునీర్ ప్రవర్తన జాతీయ భద్రతకు హానికరమని సీఆర్పీఎఫ్‌ పేర్కొంటూ శనివారం అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.

 Marriage: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

అనుమతి

తాజాగా, దీనిపై మునీర్ అహ్మద్‌ స్పందించారు. తనపై చర్యలు తీసుకోవడం అన్యాయమని, కోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశాడు. అంతేకాదు, తన పెళ్లికి కేంద్రం నుంచి కూడా అధికారిక అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

Read also: Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ పేసర్ పై నిషేధం ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870