हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు

Sharanya
TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు

తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మే 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు వేలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశముంది. దీనితో ఈ భారీ ఈవెంట్‌కు అవసరమైన భౌతిక వసతుల ఏర్పాట్లపై పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తోంది.

స్థల పరిశీలనలో టిడిపి కీలక నేతలు

శనివారం టిడిపి ఎమ్మెల్యేలు బీద రవిచంద్ర, రాంగోపాల్ రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు నిపుణుడు జయరామిరెడ్డి కడపలో పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ బృందం సీకే దిన్నె మండలంలోని చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించి తగిన ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలకు అనుసంధానంగా ఉండడం వలన రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మహానాడు ప్రాంగణం, వేదిక నిర్మాణం, భోజన శిబిరాలు, వాహనాల పార్కింగ్, నివాస ఏర్పాట్లు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థలాలను ఎంపిక చేశారు.

భూమి యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు

స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మద్దతుతో సంబంధిత భూముల యజమానులతో సంప్రదించి నిరభ్యంతర పత్రాలను కూడా సేకరించారు. పార్టీకి అండగా ఉండేందుకు కడప ప్రజలు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న (మే 7) మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ తర్వత నుంచే శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసి మే 27న ఘనంగా మహానాడును ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: Vallabaneni Vamsi:అస్వస్థతకు లోనైన వంశీ.. చికిత్స అనంతరం విజయవాడ జైలుకు తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870