ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో జట్లు కడదాకా కొట్లాడుతున్నాయి. లీగ్‌లో తీవ్ర ఒడిదొడుకులతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అభిమానులను మళ్లీ నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. గుజరాత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 186/6 స్కోరుకు పరిమితమైంది. అభిషేక్‌శర్మ(41 బంతుల్లో 74, 4ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా లాభం లేకపోయింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48, 9 ఫోర్లు) దంచేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బౌలింగ్
సిరాజ్ తొలి ఓవర్లో రెండో బంతిని అభిషేక్ లాంగాఫ్ మీదుగా సిక్స్‌తో ఛేదనను ప్రారంభించాడు. నాలుగు బౌండరీలతో హెడ్ జోరు మీదే కనిపించాడు. కానీ ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్‌తో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. అభిషేక్, ఇషాన్ కిషన్ (13) క్రీజులో ఉన్నా 5-10 ఓవర్ల మధ్య హైదరాబాద్ చేసింది 40 పరుగులే. అభిషేక్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించకపోగా ఇషాన్ వైఫల్యం కొనసాగింది.కొయెట్జ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఫిఫ్టీ తర్వాత అభిషేక్ గేర్ మార్చినా అప్పటికే ఛేదించాల్సిన రన్‌రేట్ 15కు పెరిగిపోయింది. క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆరు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 98 పరుగులు అవసరమవగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో క్లాసెన్(23), అనికేత్(3), మెండిస్(0) నిరాశపరిచారు. అభిషేక్ ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేక రైజర్స్ ఏడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

క్యాచ్
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కమిన్స్ ఈ ఓటమికి తాను కూడా ఓ బాధ్యుడినేనని అంగీకరించాడు. ‘పవర్ ప్లేలో మా బౌలింగ్ గొప్పగా లేదు. ఈ విషయంలో నాకు గిల్టీగా ఉంది. పవర్ ప్లేలోనే మేం 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. ఒకటి, రెండు క్యాచ్‌లను మేం పట్టాల్సింది. ఇక్కడ కూడా నేనే దోషిని. 200 పరుగుల లక్ష్యం అయితే ఛేదించేందుకు సులువుగా ఉండేది.గుజరాత్ బ్యాటర్లు క్లాస్ ఆటగాళ్లు. వాళ్లు అనవసర షాట్స్ ఆడరు. బ్యాడ్ బాల్స్ వేస్తే మాత్రం వదలరు. ఈ మ్యాచ్‌లో మేం చాలా చెత్త బంతులు వేసాం. వాస్తవానికి ఇది మంచి పిచ్. బౌలింగ్ విషయంలో చివరి 14 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే ఇవ్వడం గొప్ప విషయం. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడాడు. మా బ్యాటర్లు బంతులు ఎక్కువగా వదిలేయడంతో పాటు లేట్‌గా ఆడారు. గతేడాది మెగా వేలం జరిగింది. గత మూడేళ్లుగా ఆడిన కోర్ టీమ్‌ను కొనసాగించారు. అయినా ఈ సీజన్ మాకు కలిసి రాలేదు.’అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
Read Also: Simbu: కోహ్లీపై హీరో శింబు కామెంట్స్