ఇరాన్ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ నుంచి ఎటువంటి ఇంధన కొనుగోళ్లు కూడా తక్షణం ఆపేయాలని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. అలాగే, ఇలాంటి కొనుగోళ్లు కొనసాగిస్తే తగిన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని తెలిపారు.
భవిష్యత్తులో అమెరికాతో ఎలాంటి వాణిజ్య అవకాశాలు ఉండవని అర్ధం
ట్రంప్ హెచ్చరికల్లో మరో కీలకమైన అంశం ఏమిటంటే ..ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలకు భవిష్యత్తులో అమెరికాతో ఎలాంటి వాణిజ్య అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. ఇది చిన్నచూపు చర్య కాదని, అమెరికా భద్రతా ప్రయోజనాల పరిరక్షణ కోణంలో తీసుకున్న నిర్ణయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ను ఒడిలోకి తెచ్చేందుకు అమెరికా కఠిన విధానాలను కొనసాగించనుంది అనే సంకేతాలను ఈ వ్యాఖ్యలు ఇస్తున్నాయి.
ఇరాన్‌తో అమెరికా వివాదం
ఇదిలా ఉండగా ఇరాన్‌తో అమెరికా మధ్య అణు ఒప్పందం విషయంలో ఇప్పటికే తీవ్ర వివాదం నెలకొంది. ట్రంప్ హయాంలో అమెరికా 2015 అణు ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత చిలికిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంధన వ్యాపారం అంశంపై ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తుంది.
Read Also : Amaravati Relaunch : అమరావతి శంకుస్థాపనపై శ్యామల ఫైర్