టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు #సింగిల్ ట్రైలర్ చూసిన వారంతా బాగానే నవ్వుకున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే #సింగిల్ చూసిన వారందరికీ వివాదం మాత్రం కచ్చితంగా అవుతుందని అనుకుంటారు. ఇప్పుడు అలానే ఓ కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. కన్నప్ప చిత్రంలో విష్ణు మంచు శివయ్యా అనే డైలాగ్‌ని సోషల్ మీడియాలో ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో మీమ్స్‌గా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక #సింగిల్ టీం కూడాా ఆ ట్రెండీ మీమ్ కంటెంట్‌ను వాడుకుంది.#సింగిల్ ట్రైలర్‌లో బాలయ్యని వాడేశారు.యానిమల్ ఐకానిక్ షాట్ వాడారు.. అలానే కన్నప్ప శివయ్య డైలాగ్‌ను వాడారు. ఇక పాటల్లో అయితే ఏకంగా అల్లు అరవింద్‌నే ఇమిటేట్ చేశారు. దిల్ రాజు స్టెప్పుల్ని వాడుకున్నారు. ఇలా ట్రెండి కంటెంట్‌ను అంతా వాడుకున్నారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు మాత్రం #సింగిల్ టీం మీద ఫైర్ అయ్యాడని సమాచారం. తన సినిమాలోని డైాలాగ్‌ను అలా వాడుకోవడంపై ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తోంది.
రియాక్ట్
దీంతో మంచు విష్ణుకి, కన్నప్ప టీంకి #సింగిల్ టీం క్షమాపణలు చెప్పింది. తామంతా ఒకే పరిశ్రమకు చెందిన వారమని, తామంతా ఒకటే అని, ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించమని శ్రీ విష్ణు తన టీంతో కలిసి ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఇక ఈ తతంగాన్ని అంతా చూసిన బన్నీ వాస్ ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బన్నీ వాస్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.శాంతి.. శాంతి.. శాంతి.. అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కి ఎస్ కే ఎన్ రిప్లై ఇచ్చాడు. అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే తరువాత సంగతి తరువాత అంటూ ఎస్ కే ఎన్ వేసిన ట్వీట్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. అన్నా అందరికీ నీ అంత స్పీడు ఉండాలి కదా అంటే ప్రభాస్ సలార్ జిఫ్ ఫైల్‌తో అదిరిపోయేలా ఎస్ కే ఎన్ రిప్లై ఇచ్చాడు. ఇక వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా? మున్ముందు మంచు విష్ణు కన్నప్ప టీం వర్సెస్ #సింగిల్ టీం అన్నట్టుగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అన్నది చూడాలి. ఇక ముందు జరిగే ఈవెంట్లలో ఈ వివాదం గురించి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Read Also: HIT 3 Movie: ‘హిట్ 3’ సినిమా రివ్యూ