స్టార్ బాక్సర్ మేరీ కోమ్ బుధవారం ఏప్రిల్ 30న విడాకులు ప్రకటించారు. ఆమె తన భర్త కరుంగ్ ఓన్లర్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిద్దరూ 2005 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మేరీ కోమ్ విడాకుల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. విడాకులకు ముందు మేరీ కోమ్కు హితేష్ చౌదరితో సంబంధం ఉందని పుకార్లు వచ్చాయి. హితేష్ చౌదరి ప్రస్తుతం మేరీ కోమ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మేరీ కోమ్ ఈ విషయాలన్నింటిపై తన మౌనాన్ని వీడి లేఖను పంచుకోవడం ద్వారా స్పందించింది. గత రెండు సంవత్సరాలు వ్యక్తి గత జీవితం చాలా కష్టంగా గడిచిందని మేరీ కోమ్ అన్నారు. మేరీ కోమ్ బాక్సింగ్ ఫౌండేషన్ చైర్మన్ అయిన హితేష్తో తనది వ్యాపార సంబంధమేనని స్పష్టంజేసింది. కాగామేరీ వ్యక్తిగత జీవితంపై కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె న్యాయ బృందం స్పందించింది. ఈమేరకు సుదీర్ఘమైన ప్రకటన విడుదలజేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా కోమ్ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో కోరారు. కాగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను మేరీ, హితేష్ తమ సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించారు.
మేరీ
మేరీ, కరుంగ్ 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవలలు సహా ముగ్గురు కుమారులున్నారు. తర్వాత బాలికను దత్తత తీసుకున్నారు. కాగా 2022లో జరిగిన మణిపూర్ లోకసభ ఎన్నికల్లో మేరీ భర్త పోటీచేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికకు 2-3 కోట్ల రూపాయలు ఖర్చయిందట. దీని తర్వాత మేరీ పిల్లల్ని తీసుకుని ఫరీదాబాద్ వెళ్లిపోగా, భర్త ఢిల్లీలోనే ఉంటున్నాడు.
పతకాలతో
మేరీ కోమ్ భారత్లో అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఇది కాకుండా మేరీ కోమ్ ఇప్పటివరకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 6 బంగారు పతకాలతో సహా మొత్తం 8 పతకాలను గెలుచుకున్నారు. ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ఛాంపియన్షిప్లో 6 బంగారు పతకాలు సాధించిన ప్రపంచంలోనే ఏకైక మహిళా బాక్సర్ ఆమె.
Read Also: IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే!