हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్

Anusha
IPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత ఇలాఖాలో వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకున్న చెన్నై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(41 బంతుల్లో 72, 5ఫోర్లు, 4సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌(36 బంతుల్లో 54, 5ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. పతిరన(2/45), ఖలీల్‌(2/28) రెండేసి వికెట్లు తీశారు. తొలుత టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్‌ కరన్‌ (47 బంతుల్లో 88, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (32) రాణించారు. కింగ్స్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ (4/32) ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదుచేయగా అర్ష్‌దీప్‌ (2/25), యాన్సెన్‌ (2/30) తలా రెండు వికెట్లు పడగొట్టారు.

 IPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి  సీఎస్కే ఔట్

బౌండరీ

చెన్నై ఇన్నింగ్స్‌లో కరన్‌ ఆటే హైలైట్‌. 6 ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సీఎస్‌కేను బ్రెవిస్‌ అండతో అతడు ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ తప్ప చెన్నై బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేదు. ఈ సీజన్‌లో సరైన ఆరంభాలు లేక తంటాలు పడుతున్న చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఆ తిప్పలు తప్పలేదు. యువ ఓపెనర్లు రషీద్‌ (11), అయుశ్‌ (7) విఫలమవగా నాలుగో స్థానంలో వచ్చిన జడేజా (17) నాలుగు బౌండరీలతో అలరించినా అతడూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. పవర్‌ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 48/3. ఈ క్రమంలో కరన్‌ సీఎస్‌కే తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. హర్‌ప్రీత్‌ బ్రర్‌ 8వ ఓవర్లో సిక్స్‌ బాదిన అతడు చాహల్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ బౌండరీలు కొట్టాడు.అదే ఓవర్లో మూడో బంతికి డబుల్‌ తీసి హాఫ్‌సెంచరీ సాధించిన కరన్‌ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. షెడ్గె వేసిన మరుసటి ఓవర్లో అతడు 6, 6, 4, 4తో ఏకంగా 26 రన్స్‌ రాబట్టాడు. ఒక ఓవర్లో చెన్నై ఇన్ని పరుగులు చేయడం ఈ సీజన్‌లో ఇదే ప్రథమం. కరన్‌తో పాటు దూబె కూడా క్రీజులో ఉండటంతో చెన్నై జోరు చూస్తే 220 ప్లస్‌ దాటుతుందేమో అనిపిస్తుంది. కానీ యాన్సన్‌ బౌలింగ్‌లో కరన్‌ ఔట్‌ అవడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ కుదేలైంది.

Read Also: IPL 2025: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870