మరో రెండు రోజుల్లో కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటే వచ్చే నెలలో చేయాల్సిన పనులు, కొత్త ప్లాన్స్ అందరికి ఉండే ఉంటాయి. అందులో ముఖ్యంగా బ్యాంకు సంబంధిత పనులు ఉంటే తప్పకుండా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. మే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూతపడతాయో ముందుగానే తెలుసుకోవడం, లేదంటే మీ విలువైన సమయం వృథా కావొచ్చు.

బ్యాంకు సెలవుల లిస్ట్
మీరు బ్యాంకు కస్టమర్ అయితే లేదా బ్యాంక్ వెళ్లాల్సి వస్తే ముందుగా బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో తెలియాలంటే మే నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ చూడాల్సిందే. దీని బట్టి మీ బ్యాంక్ పనులు ముందుగా ప్లానింగ్ చేసుకోవచ్చు.
మొదటి రోజే షాక్, మే 1న బ్యాంకులు పనిచేస్తాయా : మే నెల 1వ తేదీ గురువారం రోజున కార్మిక దినోత్సవం అంటే లేబర్ డే ఇంకా మహారాష్ట్ర దినోత్సవం కూడా. ఈ రోజున ఇండియాలోని అన్ని చోట్లా కాకుండా కొన్ని సెలెక్ట్ చేసిన రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో రాష్ట్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా అక్కడ బ్యాంకులు పనిచేయవు. ఇక కార్మిక దినోత్సవం విషయానికొస్తే.. బీహార్, గోవా, మణిపూర్, గుజరాత్, కేరళ, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ సహా అస్సాంలలో కూడా బ్యాంకులు పని చేయవు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నవారు మీ బ్యాంకు పనులను ముందుగానే చూసుకోవడం మంచిది.
మే నెలలో సెలవులు లిస్ట్ ఇదే
మే 4, ఆదివారం: సాధారణంగా బ్యాంకులకు వీకెండ్ హాలీ డే. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. మే 8, బుధవారం: గురు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లలో బ్యాంకులు పనిచేయవు. మే 10, శనివారం: నెలలో వచ్చే రెండో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి. మే 11, ఆదివారం: వీకెండ్ హాలీ డే. భారతదేశంలోని అన్ని బ్యాంకులు ఈరోజు పనిచేయవు. మే 12వ తేదీ, సోమవారం: బుద్ధ పూర్ణిమ. ఈ రోజున దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరాం, మణిపూర్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 16, శుక్రవారం: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా కేవలం సిక్కింలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. మే 18, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వీకెండ్ హాలీ డే. మే 24, శనివారం: నెలలో నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. మే 25, ఆదివారం: వీకెండ్ హాలీ డే. భారతదేశంలోని అన్ని బ్యాంకులు ఈరోజు మూతపడతాయి. మే 26, సోమవారం: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో బ్యాంకులు మూసివేయబడతాయి. మే 29, గురువారం: మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇంకా హర్యానాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 30, శుక్రవారం: శ్రీ గురు అర్జున్ దేవ్ జీ దినోత్సవం సందర్భంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.
Read Also: Viral : పోలీస్ స్టేషన్ కు అనుకోని అతిధి..షాక్లో పోలీసులు