ACB searches : తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 26న ఉదయం నుంచే ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించినట్లు అధికారులు గుర్తించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది ఎన్డీఎస్ ఏ. కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏసీబీ సోదాలు చేస్తోంది.
మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు
మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు, క్లియరెన్సులు లేవని ఎన్డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై సీడీవో ఇచ్చిన పలు డ్రాయింగ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయనేలేదని, అది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది.
Read Also: తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి!