ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. అలాగే ఈ రైల్వే కోట్లాది మంది ప్రయాణికులకు చాల రకాల సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణ సమయంలో లేదా రైల్వే స్టేషన్లో రైల్వే రూల్స్ పాటించడం తప్పనిసరి. కానీ రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధమని మీకు తెలుసా..? రైళ్లలో గ్యాస్ సిలిండర్లు, మండే పదార్థాలను తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం ఈ విషయం చాల మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ లిస్టులో మరొకటి కూడా ఉంది. దీనిని తీసుకెళ్తే జరిమానా లేదా జైలు లేదంటే రెండు కూడా విధించవచ్చు.
రైలులో ఎలాంటివి తీసుకెళ్లడం నిషేధం
రైల్వే నిబంధనల ప్రకారం స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, పటాకులు, బలమైన వాసన వచ్చే వస్తువులు (తోలు లేదా తడి చర్మం వంటివి), నూనె, సిగరెట్లు, పేలుడు పదార్థాలను రైలులో తీసుకెళ్లడం నిషేధం. దీనితో పాటు ప్రత్యేకమైనవి అంటే ఎండు కొబ్బరికాయ తీసుకెళ్లడం కూడా పూర్తిగా నిషేధం. ఎండు కొబ్బరికాయ బయటి ఉపరితలంపై పెరుగుతున్న పీచు గడ్డి కారణంగా అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని రైలులో తీసుకెళ్లడం నిషేధం. ఎండు కొబ్బరికాయ బయటి పీచు భాగం మండే స్వభావం ఉంటుంది, ఇంకా రైలు అలాగే ప్రయాణీకుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది. అయితే, కొబ్బరి బొండం లేదా ఇతర పండ్లు వంటివి రైలులో సులభంగా తీసుకెళ్లవచ్చు.

రైలులో వీటిని తీసుకెళ్లడం నిషేధం

మద్యం పై నిబంధన: రైల్వే నిబంధనల ప్రకారం ఏ ప్రయాణీకుడూ కూడా మద్యం సేవించిన తర్వాత లేదా మత్తులో రైలులో ప్రయాణించకూడదు. ఒక ప్రయాణీకుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే రైల్వేలు అటువంటి వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవచ్చు. మీరు మీ పెంపుడు జంతువును తీసుకెళ్లాలనుకుంటే, దానికి వేర్వేరు రూల్స్ ఉంటాయి. AC ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఉన్న వారికి ఈ ప్రత్యేక రూల్స్ వర్తిస్తాయి. గుర్రాలు లేదా మేకలు వంటి కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి కూడా అనుమతి ఉంది.
Read Also: Mayonnaise : స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ తెలిపిన తమిళనాడు ప్రభుత్వం