జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. పహాల్గమ్ ప్రాంతంలో పర్యాటకుల పై టెర్రటిస్టులు కాల్పులు జరపడంతో 28 మంది ప్రజలు మృతి చెందారు. అయితే ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా బృందం టెర్రటిస్టులు, ఉద్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అత్యవసర సమావేశం ఏర్పాటు అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయాలనీ ఆదేశించారు. అయితే ఈ ఐదు కీలక ప్రకటనలు పాకిస్థాన్ ప్రజలను మాత్రమే కాకుండా, పాక్ దేశ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ ఇంకా జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే ఈ చర్యల ప్రతిఫలనం 24 గంటల్లో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది.

జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తత
నేడు గురువారం ఉదయం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ (PSX) భారీ పతనంతో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, చైనా-తైవాన్ వంటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెమ్మదిస్తున్న సమయంలో ఆసియా మార్కెట్‌లో జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తతను సృష్టించింది. పాకిస్థాన్ స్టాక్ ఇండెక్స్ KSE-100 గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లో 2.12% అంటే 2,485.85 పాయింట్లు పతనమై 114,740.29 పాయింట్లకు చేరుకుంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఈ పతనం సగానికి 1,535 పాయింట్లకి తగ్గి 115,591 పాయింట్ల వద్ద కొనసాగిస్తోంది.
స్టాక్ మార్కెట్ భారీ పతనం
పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనా: నిన్న బుధవారం కూడా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ముగిసిన నేపథ్యంలో, గురువారం అదే పతనాన్ని కొనసాగిస్తూ ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించినట్లు ప్రకటించడంతో బుధవారం ఈ పతనం సంభవించింది. దీనికి తోడు పాకిస్థాన్ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.00355 రూపాయలు పడిపోయింది. రాజకీయ అస్థిరత, కాశ్మీర్‌లో భద్రతా ఆందోళనల గురించి ఫిచ్ రేటింగ్స్ (Fitch Ratings) హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. గత మూడు సంవత్సరాలుగా IMF నుండి రుణాల కోసం పోరాడుతున్న పాకిస్థాన్‌కు ఇది భారీ నష్టం.
భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఇవాళ గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదుడుకులతో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లు ఈ పరిస్థితులని పరిశీలిస్తు జాగ్రత్త వహిస్తున్నారు. ఉదయం 11:37 గంటల సమయంలో BSE సెన్సెక్స్ 233 పాయింట్లు అంటే 0.29% పతనమై 79,884 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ50 ఇండెక్స్ 69 పాయింట్లు లేదా 0.28% తగ్గి 24,259 పాయింట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో, సెన్సెక్స్ 312.50 పాయింట్లు పతనమై 79,790.47 పాయింట్లకు, నిఫ్టీ 86.60 పాయింట్లు తగ్గి 24,241.60 పాయింట్లకు చేరుకుంది.
ఇన్వెస్టర్లను జాగ్రత్త: భారత స్టాక్ మార్కెట్లలో ఈ స్వల్ప పతనం పాకిస్థాన్‌తో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఇన్వెస్టర్లను జాగ్రత్తగా పరిగనిస్తూ పెట్టుబడులు చేయవలసిన పరిస్థితిని సూచిస్తుంది.భారతదేశం కఠినమైన చర్యలు, క్షీణిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పాక్ దేశ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉంది.
Read Also: Russia : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం