తమిళనాడు ప్రభుత్వం పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోన్నైస్ ను ఒక సంవత్సర కాలం పాటు నిషేధించింది. ఈ నిషేధం ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకం, అన్నింటికీ వర్తిస్తుంది. ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పచ్చి గుడ్లలో బ్యాక్టీరియా ఉండటం వలన ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం తెలిపింది,ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది.ఈ చర్యలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
డిప్
మయోన్నైస్ ఆరోగ్యానికి అధిక ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ఈ నిషేధం విధించినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ లాల్వేనా తెలిపారు. మయోనైస్‌ను గుడ్లు, నూనె, వెనిగర్ వంటి ఇతర పదార్థాలతో తయారు చేసే ఒక మందపాటి క్రీమీ సాస్. దీనిని ప్రధానంగా సలాడ్ డ్రెస్సింగ్, సాండ్‌విచ్‌లలో,ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఉపయోగిస్తారు.ఈ మయోన్నైస్‌ను పెద్ద షాప్స్ తో పాటు రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లల్లో కూడా తయారు చేసి విక్రయిస్తారు. ప్రజలు ఈ మయోన్నైస్ తో చికెన్ , శాండ్విచ్ లు తింటారు.ఈ మయోన్నైస్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మయోన్నైస్ తినడం వల్ల మరణాలు సంభవించాయి. ఫలితంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మయోన్నైస్ పై నిషేధం విధించబడింది.మయోన్నైస్ ను గుడ్డులోని పచ్చసొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో తయారు చేస్తారు. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, శాండ్‌విచ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, షవర్మా ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా డిప్ చేసుకొని తింటారు. అయితే చాలామంది హోటల్ నిర్వాహకులు మయోన్నైస్ తయారీలో ఏమాత్రం శుభ్రతను పాటించడం లేదు. కొన్ని గుడ్లపై ఉండే దూళి, వంట మనిషి చేతులకు అలాగే అంటుకుంటుంది. గుడ్డును ఇతర ముడి పదార్థాలను తీసుకుని సొనలో కలుపుతారు.

ఇతర రాష్ట్రాల్లో
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక మహిళ, రోడ్డుపక్కన ఉన్న ఓ స్టాల్‌లో మయోన్నైస్‌తో మోమోస్ తిన్న అనంతరం అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించడంతో, ఆ స్టాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలతో అక్కడ మయోన్నైస్ అమ్మకాన్ని నిషేధించారు.సాండ్విచ్‌లు, బర్గర్‌లు, పిజ్జాలు, షావర్మా లాంటి ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్‌కి ఇది ఉపయో గిస్తారు, ఇది సాధారణంగా తెల్లగా ఐస్‌క్రీమ్ లాగా కనిపిస్తూ, గుడ్డు పచ్చ, నిమ్మరసం, నూనె, ఉప్పు వంటి పదార్థాలతో తయారుచేస్తారు. అయితే ఇది వేడి చేయబడని పదార్థంగా ఉండడం వల్ల, హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి