हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Pahalgham Attack: కాశ్మీర్ ఉగ్రదాడిలో ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలు విడుదల

Vanipushpa
Pahalgham Attack: కాశ్మీర్ ఉగ్రదాడిలో ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలు విడుదల

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు తాజాగా విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులను ఆసిఫ్‌ ఫౌజి, సులేమాన్‌ షా, అబు తాలా గా గుర్తించారు. వీరికి మూసా, యూనిస్‌, ఆసీఫ్‌ అనే కోడ్ నేమ్స్ ఉన్నట్లు పీటీఐ వెల్లడించింది. వీరంతా జమ్మూకశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్ర సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
ఈ ఊహాచిత్రాలు దాడి సమయంలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షుల వివరణల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఉగ్రవాదులు దాడి సమయంలో పురుషులను వేరు చేసి వారి గుర్తింపులు పరిశీలిస్తున్న సమయంలో కొంతమంది బాధితులు వారి ముఖాలను చూశారని సమాచారం. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది.

ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటో విడుదల
అలాగే, ఒక ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. దాడి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలైంది. ముష్కరులు హెల్మెట్లకు అమర్చిన బాడీ కెమెరాల సహాయంతో ఈ దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఉగ్రవాదులు ముందుగా బాధితులను ఒకచోట చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు. అనంతరం గుంపు మీద అతి కఠినంగా దాడి చేశారు. కొంతమందిని స్నైపర్ టెక్నిక్‌తో దూరం నుంచే లక్ష్యంగా చేసుకుని కాల్చినట్టు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్‌ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు సమాచారం.
కొందరి పరిస్థితి విషమం
అంతే కాకుండా తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. అయితే పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తోయిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది. దాంతో జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక.. ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం భద్రతా దళాలు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Read Also: Saifulla Sajid Jutt: పహల్గామ్‌ దాడికి సూత్రధారి సైఫుల్లా సాజిద్ జుట్?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870