हिन्दी | Epaper

Terrorist Attack : శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: రామ్మోహన్‌ నాయుడు

sumalatha chinthakayala
Terrorist Attack : శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: రామ్మోహన్‌ నాయుడు

Terrorist Attack : జమ్మూకశ్మీర్‌లోని పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్‌ నుంచి ముంబయి, ఢిల్లీకి చేరుకుంటాయని.. ఈవిషయంపై మంగళవారం హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడానని తెలిపారు.

  శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన

అవసరమైతే మరిన్ని విమానాలు

అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులోభాగంగా మంత్రి అన్ని విమానయాన ఆపరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా.. సాధారణ స్థాయి ఛార్జీలను వసూలుచేయాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

జమ్మూలో ప్రస్తుత పరిస్థితుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడుతో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా తిరిగి రావడంలో సాయం చేయడానికి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. మృతదేహాన్ని విమానంలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Read Also: పహల్గామ్ ఉగ్రదాడి.. తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..

ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..

విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

📢 For Advertisement Booking: 98481 12870