हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ!

Anusha
IPL 2025: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జైపూర్ మైదానంలో తన అటాకింగ్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌ను శక్తివంతమైన సిక్స్ కొట్టడం ద్వారా ప్రారంభించాడు. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 170 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ 2 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసిన ఈ బిహార్ కుర్రాడు స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఔటైన అనంతరం ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. 14 ఏళ్ల వయసే అయినా తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. ఈ ప్రదర్శనతో ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. అతని ఆటకు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయ్యింది.

వైభ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ టీమిండియా దిగ్గజ కెప్టెన్, సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ కాళ్లు మొక్కిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ గత మార్చి 30న గౌహతి వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో వైభవ్ సూర్యవంశీ ధోనీ ఆశీర్వాదం తీసుకున్నాడు.ధోనీ దగ్గరకు రాగా వంగి కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయగా ధోనీ వారించాడు. అప్పటికీ వైభవ్ సూర్యవంశీ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. తాజాగా అతను అరంగేట్రంలోనే అదరగొట్టడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

https://twitter.com/Abhinav_hariom/status/1914549689141035400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1914549689141035400%7Ctwgr%5Ea501a8a6205073832da050636b6ef582519cd157%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.mykhel.com%2Fcricket%2Fipl-2025-vaibhav-suryavanshis-touches-ms-dhonis-feet-during-the-post-match-handshake-092397.html

తన కెరీర్‌లో

వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వైభవ్ కంటే ముందు ఈ రికార్డు ప్రేయాస్ రే బర్మాన్ పేరిట నమోదైంది. అతను 2019 సంవత్సరంలో 16 సంవత్సరాల 157 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టిన 10వ బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్‌లో తన తొలి బంతికే వైభవ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.వైభవ్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్లు ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నారు. కానీ అతను ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

Read Also: CSK : సిఎస్ కె పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870