వారణాసి ఘాట్ పై కనిపించిన మాతృమూర్తి
ఉత్తర్ ప్రదేశ్‌లోని పవిత్రమైన వారణాసి బనారస్ ఘాట్ వద్ద ఒక విషాదకర ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ తల్లి, తన కన్న కొడుకే వారణాసి ఘాట్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, జన్మనిచ్చిన తల్లిని అలా నిర్లక్ష్యంగా వదిలేయడం ఎంతో బాధాకర విషయం. ఈ వృద్ధురాలు గత పదిహేను రోజులుగా ఘాట్ పరిసరాల్లో నివసిస్తూ, దయదక్షిణల మీద ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చలి, ఆకలి, అనారోగ్యం భరించలేక చివరికి ఆమె గంగానదిలో మునిగి ప్రాణాలు విడిచిన విషాద ఘటన అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.
వృద్ధురాలికి అండగా నిలిచిన సత్య విజయ్ సింగ్
ఈ విషాదకర సంఘటనలో సత్య విజయ్ సింగ్ అనే వ్యక్తి మానవత్వాన్ని చాటిచెప్పాడు. విద్యార్థులతో కలిసి అకాడమీ టూర్ కోసం వారణాసికి వచ్చిన ఆయన, శనివారం రాత్రి 10:30 గంటలకు ఘాట్ వద్ద వృద్ధురాలిని చూసారు. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన విజయ్ సింగ్ తన బృందంతో కలిసి ఆమెకు చీరను కట్టించి, ఆహారం అందించారు. ఆమె ఏడుపు చూసి అసలు విషయం తెలుసుకోవాలని ఆసక్తి చూపిన విజయ్ సింగ్, స్థానికుల ద్వారా ఆమె గురించి తెలుసుకున్నారు. వృద్ధురాలు ధనిక కుటుంబానికి చెందినదని, ఆమె కొడుకుకి కోట్లాది రూపాయల ఆస్తి ఉందని. అయినప్పటికీ, కన్న తల్లిని ఘాట్ వద్ద వదిలేయడం అతని హృదయాన్ని హత్తుకుందట.

వృద్ధాశ్రమంలో చేర్చే యత్నం.. కానీ అప్పటికే విచారకరమైన అంతం
వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్చాలని నిర్ణయించిన విజయ్ సింగ్, ఆమె అనుమతి తీసుకుని వసతి, ఆహారం చక్కగా ఉండే వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. సామాజిక కార్యకర్త అమన్ కబీర్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమెను తరలించాలని ప్లాన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ, ఆదివారం ఉదయం ఘాట్ వద్దకు చేరుకున్నప్పుడు, వృద్ధురాలు గంగానదిలో మునిగి మృతిచెందినట్టు తెలిసింది. శరీరానికి చలి, ఆకలి, అనారోగ్యం తోడై చివరికి ఆమె ప్రాణాలను కాపాడలేకపోయాయి. పోలీసు అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మానవత్వం మరిచిన కొడుకు.. దయ చూపిన పరాయివాడు
ఈ సంఘటన మానవ సంబంధాల విలువపై ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. తల్లిని కన్న కొడుకు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నా కనికరం చూపకుండా వదిలిపెట్టడం ఎంతో దుర్మార్గమైన పని. ఇక పరాయివాడైన విజయ్ సింగ్ మాత్రం ఆమెకు కొంత ప్రేమను చూపిస్తూ, చివరి వరకూ సహాయం చేయాలని ప్రయత్నించాడు. కానీ చివరికి వృద్ధురాలిని గంగానదిలో కలిసిపోవడం అందరినీ బాధకు గురి చేసింది. ఈ సంఘటన మానవత్వానికి గుర్తుగా నిలుస్తోంది. నిజమైన బంధం, ప్రేమను మరిచిపోతున్న సమాజానికి ఇది గొప్ప గుణపాఠం.
READ ALSO: Murder: భూమి కోసం మరదలిని చంపిన వదిన