हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

Ramya
Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

బాలీవుడ్ హర్రర్ సినిమాల క్రేజ్ తగ్గేదేలే!

హారర్ మూవీస్ ఎంతగానో భయపెడతాయని తెలుసు. కానీ, భారతీయ సినీ ప్రియుల మనస్సుల్లో మాత్రం వీటి కోసం ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. హర్రర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలకు ఇండస్ట్రీలో ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. హర్రర్ మూవీ అంటేనే థియేటర్ల దగ్గర సందడి, ఓటీటీలో స్ట్రీమింగ్ సైతం విపరీతమైన రెస్పాన్స్. ప్రేక్షకుల్లో భయాన్ని రేపడంతో పాటు, మంచి కథా నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం కలిపి ఉంటే హారర్ చిత్రాల విజయం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. అయితే ఇండియన్ హర్రర్ సినిమాల మద్య, బాలీవుడ్ హర్రర్ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నా, కొన్నిసార్లు నిరాశపరిచినవి కూడా లేకపోలేదు. ఈరోజు మనం టాప్ 5 బాలీవుడ్ హర్రర్ సినిమాలు, అవి ఎప్పుడు విడుదలయ్యాయి, ఇప్పుడు ఎక్కడ వీక్షించొచ్చు అనే అంశాలపై ఓ లుక్ వేయుదాం.

బల్బుల్ – పీరియడ్ హర్రర్‌లో ఓ మణి

2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘బల్బుల్’ హిందీ పీరియడ్ హర్రర్ సినిమాల్లో మైలురాయి. అన్వితా దత్ తెరకెక్కించిన ఈ సినిమా 19వ శతాబ్దం బెంగాల్ గ్రామ నేపథ్యంతో సాగుతుంది. ఇందులో త్రిప్తి డిమ్రీ అసాధారణమైన నటనతో ఆకట్టుకుంది. అవినాష్ తివారీ, పావోలీ డ్యామ్, రాహుల్ బోస్ వంటి నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం వాతావరణ భయాన్ని, నాటి కాలపు సాంఘిక సమస్యల ముడిపాటు చూపిస్తూ హర్రర్‌కు ఓ కొత్త వ్యాఖ్య ఇచ్చింది.

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

పరి – అనుష్క శర్మ హర్రర్ అవతారం

2018లో విడుదలైన ‘పరి’ అనుష్క శర్మకు హర్రర్ సినిమాలో సరికొత్త మైలురాయి. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క మానవ రూపంలో దెయ్యంగా కనిపించింది. ఈ చిత్రం చీకటి నేపథ్యంలో, భయం, మానవ భావోద్వేగాల మిక్స్‌గా సాగుతుంది. రొటీన్ హర్రర్ సినిమాల నుంచి భిన్నంగా, దీని కథనం కొత్తదనం కలిగి ఉంది. పారితో అనుష్క షర్మ తన నటనలో విభిన్నత చూపించి ప్రేక్షకులను మెప్పించింది.

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

స్త్రీ – హర్రర్‌తో కలిసిన కామెడీ

2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్రర్-కామెడీ మిశ్రమంగా రూపొందింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. చిన్న పట్టణపు పురాణం ‘నాలే బా’ ఆధారంగా కథను మలిచారు. భయపెట్టడమే కాకుండా, నవ్వించడంలోనూ విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ హర్రర్ ట్రెండ్‌ను మార్చేసింది. ప్రస్తుతం ‘స్త్రీ’ను జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించవచ్చు.

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

తాజా హర్రర్ థ్రిల్లర్ ‘ఖౌఫ్’ గురించిన విశేషాలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల స్ట్రీమ్‌ అవుతున్న హర్రర్-థ్రిల్లర్ సిరీస్ ‘ఖౌఫ్’ గురించి మొదట మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ కథ గ్వాలియర్‌కు చెందిన మధు అనే యువతిని గూర్చి. ఢిల్లీలోని మహిళల హాస్టల్‌కు చేరిన ఆమె, అక్కడ అతీంద్రియ శక్తులు ఎదుర్కొంటుంది. తన గతంలోని భయానక అనుభవాలు, నిశ్శబ్దంగా వెంటాడే గాయాలను ఎదుర్కొంటూ ప్రయాణిస్తుంది. లింగ ఆధారిత అణచివేతను సన్నివేశాలుగా చక్కగా మలిచిన ఈ కథనం, హారర్ మాన్యా జానర్‌కు ఒక కొత్త దిశను చూపించే ప్రయత్నం చేసింది.

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

చోరీ 2 – భయాన్ని రెట్టింపు చేసిన సీక్వెల్

2021లో వచ్చిన ‘చోరీ’ కు కొనసాగింపుగా 2024లో ‘చోరీ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. విశాల్ ఫురియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నుష్రత్ భరుచ్చా ప్రధాన పాత్ర పోషించింది. గర్భవతిగా ఉన్న నాయిక చుట్టూ నడిచే భయానక అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం, ప్రేక్షకులను మరోసారి ఆదరించింది. చోరీ 2ని నాటకీయ మలుపులతో, మానసిక హర్రర్‌తో మేళవించి రూపొందించారు.

Bollywood Horror: బాలీవుడ్‌లో బెస్ట్ హారర్ మూవీస్.. ఇవే

READ ALSO: Kubera: ‘కుబేర’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870