हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sundar Pichai: వైభవ్​ సూర్యవంశీపై సుందర్​ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Anusha
Sundar Pichai: వైభవ్​ సూర్యవంశీపై సుందర్​ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జైపూర్ మైదానంలో తన అటాకింగ్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌ను శక్తివంతమైన సిక్స్ కొట్టడం ద్వారా ప్రారంభించాడు. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 170 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ 2 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. తన తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా రాజస్థాన్‌కు చెందిన యువ బ్యాటర్‌కు అభిమాని అయ్యాడు. సుందర్ పిచాయ్ తన ట్వీట్‌లో వైభవ్ సూర్యవంశీని చాలా ప్రశంసించారు.

తనదైన ముద్ర

ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన అరంగేట్ర ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 14 ఏళ్ల ఈ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 85 పరుగులు జోడించారు. తన తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ తనదైన ముద్రవేయడంలో విజయం సాధించాడు. రాజస్థాన్‌కు చెందిన ఆ యువ ఆటగాడి బ్యాటింగ్ కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా అభిమాని అయ్యాడు. “ఐపీఎల్‌లో 8వ తరగతి విద్యార్థిని చూసి మేల్కొన్నాను. ఎంత గొప్ప అరంగేట్రం” అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశాడు.

రాజస్థాన్ రాయల్స్

వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వైభవ్ కంటే ముందు ఈ రికార్డు ప్రేయాస్ రే బర్మాన్ పేరిట నమోదైంది. అతను 2019 సంవత్సరంలో 16 సంవత్సరాల 157 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా.. వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టిన 10వ బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్‌లో తన తొలి బంతికే వైభవ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.వైభవ్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్లు ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నారు. కానీ అతను ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

Read Also: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870