हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Dia Mirza: కాఫిర్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన దియా మిర్జా

Anusha
Dia Mirza: కాఫిర్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన దియా మిర్జా

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కూడా రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ షూటింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.అందాల భామ దియా మీర్జా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు 2019లో కాఫిర్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ సిరీస్ విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యం లో దియా మీర్జా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ‘కాఫిర్’ సినిమా చేసే క్రమంలో ఓ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు.ఒకానోక సమయంలో వాంతులు కూడా చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సానుభూతి

ఈ సినిమాలో చేసిన రేప్ సీన్​ ఇంకా గుర్తుంది. అది ఎంతో కష్టంగా అనిపించింది. ఆ సీన్ చేసిన తర్వాత నా కాళ్లు, చేతులు వణికిపోయాయి. మొత్తం సీక్వెన్స్ షూట్ చేశాక వెళ్లి వాంతులు చేసుకున్నా. ఇది​ భావోద్వేగపరంగా, శారీరకంగాను చాలా కష్టమైన సీన్. ఆ పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నాయో నేను చెప్పలేను, అయితే, కైనాజ్ పాత్రను పోషించడం వల్ల తాను ఒక వ్యక్తిగా ఎదగడానికి సహాయపడింది.ఇంకా నిజ జీవితంలో తల్లిగా మారడానికి ముందే నాలో తల్లి భావాలను నింపింది. ప్రతి ఆర్టిస్ట్ తాను నటించే క్యారెక్టర్ పట్ల సానుభూతి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలా భావించినప్పుడే క్యారెక్టర్ అద్భుతంగా వస్తుందని తెలిపారు.

అనుకోకుండా

ఆరేళ్ల కిందట 2019లో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాఫిర్. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండగా, ప్రస్తుతం ఇది సినిమాగా విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దియా మీర్జా, మోహిత్ రైనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో దియా మీర్జా పాక్ ఆక్రమిత్ కశ్మీర్​కు చెందిన ఖైనాజ్ అక్తర్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఆమెను ఓ ఉగ్రవాదిగా అనుమానించి జైల్లో వేస్తారు. ఆమెకు న్యాయం అందించడానికి వేదాంత్ రాథోడ్ (మోహిత్ రైనా) అనే ఓ జర్నలిస్ట్ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. షెహనాజ్ పర్వీన్ అనే ఓ పాకిస్థాన్ మహిళకు జరిగిన ఘటనల ఆధారంగా సోనమ్ నాయర్ ఈ సిరీస్​ను తెరకెక్కించారు.

Read Also: Urvashi Rautela: నా పేరుతో ఉత్తరాఖండ్‌లో గుడి ఉంది : ఊర్వశీ రౌతేలా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870