అభిషేక్, నితీశ్,బౌలర్ హర్షిత్ రాణాకు బంపరాఫర్ దక్కనుంది. ఈ ముగ్గురూ ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు అందుకోనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఏడాదికాలంలో ఒక క్రికెటర్ మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా పది టీ20లు ఆడితే వాళ్లు నేరుగా గ్రేడ్- సీ కాంట్రాక్టును అందుకునే అవకాశముంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఏడాదికాలంలో ఒక క్రికెటర్ మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా పది టీ20లు ఆడితే వాళ్లు నేరుగా గ్రేడ్- సీ కాంట్రాక్టును అందుకునే అవకాశముంది. దీని ప్రకారం చూసుకున్నా అభిషేక్ ఇప్పటిదాకా 17 టీ20లు ఆడగా అందులో నిరుటి సీజన్లో వరుసగా 12 మ్యాచ్‌లు ఆడాడు. నితీశ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులలోనూ ఆడి అంచనాలకు మించి రాణించాడు. హర్షిత్ ఈ క్రైటీరియాలో తగిన మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ అతడికీ కాంట్రాక్టు దక్కనున్నట్టు తెలుస్తున్నది. వీరితో పాటు టీ20లలో తనదైన బౌలింగ్‌తో రాణిస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4 వన్డేలు, 18 టీ20లు) కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోనున్నట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి.
విధ్వంస
పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ విజయాన్ని అందించాడు.పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు అభిషేక్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. హెడ్‌ను అండగా చేసుకుంటూ అభిషేక్ విధ్వంస రచనకు శ్రీకారం చుట్టాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టొయినిస్ ఇచ్చిన లైఫ్‌ను వినియోగించుకున్న శర్మ యాన్సెన్‌ను హ్యాట్రిక్ ఫోర్లతో అరుసుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేసే అర్ష్‌దీప్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్ మూడు ఫోర్లు కొట్టడంతో మూడో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఓవైపు అభిషేక్, మరోవైపు హెడ్ దంచుడుతో పంజాబ్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వీరి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. 20 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న అభిషేక్ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. దూకుడు ప్రదర్శించిన అభిషేక్ మరో 20 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 100 పరుగులకు చేరుకోగానే తన జేబులో నుంచి చిట్టి తీస్తూ సంబురాలు చేసుకున్నాడు.

నితీశ్ కుమార్
ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం సెంట్రల్ కాంట్రాక్ట్ రేసులో ఉన్నాడు. 18 సీజన్ ఐపీఎల్లో విఫలం అవుతున్న ఈ యంగ్‌స్టర్ ఆస్ట్రేలియా గడ్డపై ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 21 ఏళ్ల నితీశ్ మెల్బోర్న్లో అద్భుత శతకంతో రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు ఐదు టెస్టులు ఆడాడు.