हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Nani: కోర్ట్ సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ మూవీ చూడొద్దు :నాని

Anusha
Nani: కోర్ట్ సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ మూవీ చూడొద్దు :నాని

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి త‌న మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్‌’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.’హిట్’ ఫ్రాంచైజీలో ఆల్రెడీ వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో, మూడో కేసుపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్టుగా విశాఖ వేదికగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.నాని నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు నాని డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్ట్ సినిమా నచ్చకపోతే తన అప్ కమింగ్ మూవీ ‘హిట్ 3’ చూడొద్దని అన్నారు. అతను చెప్పినట్లుగా ఈ సినిమా ప్రేక్షాదరణ దక్కించుకొని, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ‘హిట్ 3’ మూవీ విషయంలో కూడా అదే స్టేట్మెంట్ ఇస్తారా? అని మీడియా మిత్రులు అడగ్గా తనను తాను తాకట్టు పెట్టుకుంటానే తప్ప, వేరే వాళ్లని తాకట్టు పెట్టనని నాని సమాధానమిచ్చారు.

ప్రొడ్యూసర్  కాదు

హిట్-3 సినిమాకి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి నా నెక్స్ట్ మూవీకి నేను ప్రొడ్యూసర్ కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ, వేరే వాళ్ళని తాకట్టు పెట్టలేను. ‘హిట్ 3’ లాంటి రేసీ థ్రిల్లర్, ఇలాంటి జోనర్, ఇలాంటి వైలెన్స్ ను బాగా నేరేట్ చేయగలిగితే అలాంటి సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మే 1న ఫుల్ మీల్స్ పెడుతుంది. తెలుగులో మీకొక కొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. నేను చెప్పింది జరగకపోతే, నెక్స్ట్ టైమ్ నానిని నమ్మకండి. అంతకంటే ఇంకేమీ చెప్పను” అని నాని అన్నారు.

  Nani: కోర్ట్ సినిమా నచ్చకపోతే  'హిట్ 3' మూవీ చూడొద్దు :నాని

నమ్మకం

నాని మాట్లాడుతూ ”మనకు ఎప్పుడూ అలవాటు లేని ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా ఇది. కొత్తగా ఇంపాక్ట్ ఫుల్ గా చేసిన ప్రతిసారి తెలుగు ఆడియన్స్ చాలా గొప్పగా ఆదరించారు. దానికి వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకోసారి మే 1వ తేదీకి మీరూ నేను కలిసి గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి చాలా చేసుకోవాలి. నాని యాక్షన్ సినిమాలో చేయాలని కోరుకునే వారంతా మే 1న థియేటర్స్ కి వచ్చేయండి. మ్యాడ్ నెస్ ఉంటుంది. ఇది నా ప్రామిస్” అని అన్నారు.

Read Also: Kamal Haasan : నటుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870