हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ధోనీ అవుట్‌పై సోషల్‌ మీడియాలో వివాదం

Anusha
IPL 2025: ధోనీ అవుట్‌పై సోషల్‌ మీడియాలో వివాదం

ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు 2025 సీజన్ ఆశించినంతగా సాగడం లేదు. సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్‌ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా,చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. అందరూ విఫలమైనా గుడ్డిలో మెల్లలా శివమ్‌ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్‌, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సునీల్‌ నరైన్‌ (3/13) బంతితో పాటు బ్యాట్‌ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తోనూ రాణించి కేకేఆర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనను కోల్‌కతా 10.1 ఓవర్లలోనే దంచేసింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది మూడో విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి.

ధోనీ అవుట్‌

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దారుణంగా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 103 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌కు మహేంద్ర సింగ్‌ ధోనీ చాలా రోజుల తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం ఒక పరుగు చేసి అవుట్‌ అయిన విషయం తెలిసిందే. ధోనీ అవుట్‌పై సోషల్‌ మీడియాలో వివాదం చెలరేగింది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు ధోని అవుట్‌పై ప్రశ్నలు సంధించారు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఒకానొక సమయంలో సీఎస్‌కే 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

మూడో మ్యాచ్‌

రీప్లే వీడియోలో బంతి బ్యాట్ వైపు నుంచి వెళ్లిన సమయంలో బంతి బ్యాట్‌కు తాకినా.. అవుట్‌ ఇవ్వడంతో ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం శివం దూబే మాత్రం 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత విజయ్‌ శంకర్‌ మాత్రమే 29 పరుగులు చేశాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నైకి ఇది ఐదో ఓటమి. చెపాక్‌లో అత్యల్ప స్కోర్‌ చేసిన సీఎస్‌కే సొంత మైదానంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. టాస్‌ నుంచి సీఎస్‌కేకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత నరైన్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు 18 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు. 

Read Also: IPL 2025: వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ మ్యాచ్ ఆడటం లేదు:రిషభ్ పంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870