हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Donald Trump:ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లు నమోదు చేసిన ట్రంప్ సర్కార్

Anusha
Donald Trump:ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లు నమోదు చేసిన ట్రంప్ సర్కార్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న 6 వేల మంది వలసదారులను ట్రంప్ ప్రభుత్వం రికార్డుల్లో చంపేసింది. వారంతా జీవించి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో మరణించినట్లు అప్ డేట్ చేశారు. దీంతో వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది తప్పనిసరి. అమెరికా పౌరులతో పాటు తాత్కాలికంగా ఆశ్రయం కోసం వచ్చిన వారికీ ప్రభుత్వం ఈ నెంబర్ ను కేటాయిస్తుంది. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేదంటే వారు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే పరిగణించబడతారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం వారికి ఉండదు. అంతేకాదు, ఉద్యోగం కానీ, ఏదైనా చిన్నపాటి పని కానీ చేసుకునే వీలు ఉండదు. వలసదారులు తమకు తామే అమెరికాను విడిచి వెళ్లిపోయేలా చేసేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొమ్మన లేక పొగ బెట్టినట్లనేది తెలుగు సామెత కానీ ట్రంప్ సర్కారు మాత్రం పొమ్మనే పొగ పెట్టినట్లు ఇలా రికార్డుల్లో వలసదారులను చంపేసింది.

90 వేల మంది వలసదారులు

బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాల ద్వారా సుమారు 90 వేల మంది వలసదారులు అమెరికాలో అడుగుపెట్టారని అధికారులు తెలిపారు. వారందరూ తాత్కాలిక ఆశ్రయం కోరి వచ్చినవారేనని వివరించారు. అయితే, గడువు ముగిసినా వారు స్వదేశానికి తిరిగి వెళ్లలేదని, అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరినీ వెతికి పట్టుకుని వెనక్కి పంపడం శ్రమతో కూడుకున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రికార్డుల్లో వారు చనిపోయినట్లు నమోదు చేస్తే సోషల్ సెక్యూరిటీ నెంబర్ రద్దయి వారంతట వారే అమెరికాను వీడుతారని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే తాజాగా 6 వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లుగా నమోదు చేశారు.

Read Also: Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870