ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. మ్యాక్స్‌వెల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది.ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెటర్ పరికరాలు, బట్టలు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇతర వస్తువులను అగౌరవ పరచడం నేరం. అందుకు తగినశిక్ష ఉంటుంది. అలాగే ఇదే అర్టికల్ కింద వికెట్లను తన్నడం, లేదా నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తించడం, అలాగే అడ్వర్టైజింగ్ బోర్డులు, బౌండరీ ఫెన్సులు, డ్రెస్సింగ్ రూం డోర్లు, అద్దాలు, కిటికీలు, ఇతర వస్తువులపై ప్రతాపం చూపించడం నిషేధం. మ్యాక్స్‌వెల్ తాజాగా ఇలాంటి పనికి పాల్పడినందుకుగాను ఐపీఎల్ యాజమాన్యం శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
తొలిసారి కాదు
ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఒక ఆటగాడికి జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన దిగ్వేష్ రాఠీకి మూడుసార్లు జరిమానా విధించగా అదే సమయంలో రిషబ్ పంత్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొదటి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలకు సైతం జరిమానా విధించారు.
18 రన్స్ తేడా
మంగళవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో విఫలమైన విషయం తెలిసిందే. కేవలం ఒక పరుగు చేసిన పెవిలియన్‌కు చేశాడు. సీఎస్‌కే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పీబీకేఎస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ (39 బంతుల్లో శతకం) చేసిన ఇండియన్ గా నిలిచాడు. అనంతరం ఛేదనలో మొత్తం ఓవర్లన్నీ ఆడిన చెన్నై 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ 18 రన్స్ తేడాతో గెలుపొందింది.పంజాబ్ జట్టు ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది.

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా ప్రియాంశ్ రికార్డులకెక్కాడు.
Read Also: IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్