అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌పై 26 శాతం మేర టారిఫ్ విధించారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కిందటి నెల 31వ తేదీ నాడే సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

చైనాపై ఏకంగా 104 శాతం మేర టారిఫ్
అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్‌లో భాగంగా టారిఫ్‌ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నాాయన. ఇప్పుడు తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం మేర టారిఫ్‌ను విధించడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 35 శాతం మేర టారిఫ్‌ను అదనంగా వడ్డించింది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్తగా ఈ 104 శాతం టారిఫ్‌ను విధించాల్సి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలపై అదనపు టారిఫ్‌ల భారాన్ని మోపారు డొనాల్డ్ ట్రంప్. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్సెనల్ కమిటీ డిన్నర్లో పాల్గొన్నారు ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడారు.
READ ALSO: Donald Trump Tariffs : అమెరికా, చైనా ట్రేడ్ వార్తో భారత్‌కు మేలు – రఘురామ్