Fierce Israeli attack.. 32 people killed in Gaza!

Israel-Hamas : ఇజ్రాయెల్‌ భీకర దాడి.. గాజాలో 32 మంది మృతి!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ వరుసదాడులతో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు, మహిళలే ఉన్నారని తెలిపారు. ప్రతిగా ఇజ్రాయెల్‌ నగరాలపై హమాస్‌ రాకెట్లతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ వరుస దాడుల వల్ల గాజాలో ఆహార, ఔషధ నిల్వలు తగ్గుతున్నాయని.. రోజురోజుకు పరిస్థితులు నిరాశాజనకంగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisements
ఇజ్రాయెల్‌ భీకర దాడి గాజాలో

గాజాలోనే 55 మంది పాలస్తీనియులు

ఈ వారంలో గాజా, సిరియాపై ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడుల్లో 64 మంది మృతి చెందారు. గాజాలోనే 55 మంది పాలస్తీనియులు మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తాజా వైమానిక దాడుల్లో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందితోపాటు ఐదుగురు పసి పిల్లలు, నలుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపాయి. హమాస్‌తో 17 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఈ ఏడాది జనవరి నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోంది. ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్‌ తిరస్కరించడంతో దాడులకు పాల్పడాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తమ సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ను కలవనున్న నేపథ్యంలో గాజాపై వరుస దాడులు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవనున్న నేపథ్యంలో గాజాపై టెల్‌ అవీవ్‌ వరుస దాడులకు పాల్పడుతుండడం గమనార్హం. ట్రంప్‌తో భేటీలో భాగంగా నెతన్యాహు హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం, బందీల విడుదల, ఇరాన్‌ అణుసంక్షోభం, తమ దేశంపై విధించిన 17శాతం టారిఫ్‌లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి నెతన్యాహు వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి.

Read Also : ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్‌ మృతి

Related Posts
Bihar: బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 13 మంది మృతి
Lightning strikes in Bihar, 13 people killed

Bihar: బిహార్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున భీకరమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలోని Read more

రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు
nagavamsi

టాలీవుడ్ ప్ర‌ముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్య‌మంత్రిని కలుస్తామ‌ని Read more

యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధతను సమర్ధించిన సుప్రీంకోర్టు
supreme court upholds validity of up madrasa education act

లక్నో: యూపీ మదర్సా చట్టం చట్టబద్ధమైనదా లేదా చట్టవిరుద్ధమైనదా.. ఈ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. గతంలో అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. Read more

కశ్మీర్ లో అడుగుపెట్టనున్న హమాస్?
పాకిస్థాన్ కి హమాస్ అధికారి

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×