Major road accident.. Handriniva Deputy Collector dies

Annamaya District : ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్‌ మృతి

Annamaya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి మధ్య రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (50) మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisements
ఘోర రోడ్డు ప్రమాదం హంద్రీనీవా

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం

కాగా, క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పరామర్శించారు. మృతిచెందిన డిప్యూటీ కలెక్టర్‌ రమ.. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Related Posts
Hyderabad: హెచ్ సియూ భూముల వివాదంలో ప్రభుత్వం చెబుతున్న విషయాల్లో నిజమెంత..
Hyderabad: హెచ్ సియూ భూముల వివాదంలో ప్రభుత్వం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు Read more

కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం!
Ukraine agrees to ceasefire proposal!

కీవ్‌: సౌదీ అరేబియాలో జరిగిన చర్చల అనంతరం, ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించింది. రష్యాతో జరిగే యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ Read more

ఫార్ములా-ఇ రేస్ పై దానం నాగేందర్
ఫార్ములా ఇ రేస్ పై దానం నాగేందర్

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడంలో ఫార్ములా ఈ-రేస్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా Read more

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
chanrdrababu

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×