ట్రంప్ గో బ్యాక్ అంటూ అమెరికన్ల మెరుపు నిరసనలు

Donald Trump: ట్రంప్ గో బ్యాక్ అంటూ అమెరికన్ల మెరుపు నిరసనలు

యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో అమెరికన్లలో సైతం ఆందోళన నెలకొంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ తో పాటు, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు చేటు చేసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్యయుద్ధాలు జరిగే అవకాశం
హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ప్రజల ఆందోళనలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హాండ్స్ ఆఫ్ పేరుతో ఆందోళనకు దిగారు. ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో జరుగుతున్న అతిపెద్ద ఆందోళన ఇది అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయ వర్గాలలో కూడా ప్రస్తుతం ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వాణిజ్యయుద్ధాలు జరిగే అవకాశం ఉందని ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisements
ట్రంప్ గో బ్యాక్ అంటూ అమెరికన్ల మెరుపు నిరసనలు

పలుచోట్ల ఆందోళనలు
ట్రంప్ గో బ్యాక్ అంటూ నిరసనలు నార్త్ కరోలినా, మసాచుసెట్స్, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ చికాగో మయామి వంటి నగరాలలో పలుచోట్ల నేడు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయం పైన కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 12 వందలకు పైగా ప్రదేశాలలో హాండ్స్ ఆఫ్ పేరుతో నిరసన ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినదిస్తున్నారు. స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వజ్ నాట్ ఎలెక్టెడ్ వంటి నినాదాలతో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

Related Posts
ట్రంప్, మస్క్ గురించి చేసిన వ్యాఖ్యలు..
Trump elon musk

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలోన్ మస్క్‌కు "అధ్యక్ష పదవిని అప్పగించడమేనా?" అనే విమర్శలను ఖండించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు తన ప్రతిపక్షాల నుండి Read more

ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్
ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

దేశంలోని టార్ సెకెండ్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. టీసీఎస్ తర్వాత ఐటీ సేవల రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన కంపెనీ ఇటీవల తన ఉద్యోగులకు వేతన పెంపులకు Read more

Ratan Tata: వెలుగులోకి రతన్ టాటా వీలునామా.. వంటమనిషికి కోటి!
వెలుగులోకి రతన్ టాటా వీలునామా.. వంటమనిషికి కోటి!

రతన్ టాటా పేరు వినగానే అతని గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే రతన్ టాటా మరణం తరువాత కొన్ని విషయాలు ఒకొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజా అతని Read more

స్పేస్‌ ఎక్స్‌ 20 స్టార్‌లింక్ ఉపగ్రహాల విజయవంతమైన ప్రయోగం
ROCKET

ఎలాన్ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్ తాజాగా 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ప్రపంచంలో ఆన్‌లైన్ కనెక్షన్‌ను అందించడంలో కీలకంగా మారింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×