Elon Musk:సుంకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్

Elon Musk:సుంకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రు, మిత్ర దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ అమెరికా కఠిన వైఖరి చూపిస్తోంది. టారిఫ్‌ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ఖాయం కావడంతో, అమెరికాలో ప్రజలు షాపింగ్ మాల్స్ వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇంటికి సంబందించిన వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10 శాతం సుంకాలు విధించినప్పటికీ, మిగతా భాగాన్ని ఏప్రిల్ 10 నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది.అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. రెవెన్యూ సర్వీసుల నుంచి 20 వేల మంది తొలగించారు. ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ బాదుడు, ట్యాక్సులతో ట్రంప్ కంపెనీ నడుపుతున్నారా? కంట్రీని నడుపుతున్నారా అనే అనుమానం కలిగిస్తోంది. అటు ట్రంప్‌ కార్పోరేట్‌ కల్చర్‌తో అమెరికాలోను హాట్‌ టాఫిక్‌గా మారింది. ట్రంప్‌ టారిఫ్‌లతో ఆర్థికవేత్తలే కాదు యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisements

కంబోడియా

అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్‌ అత్యధికంగా కంబోడియాపై 49 శాతం వరకు పన్నులు విధించారు. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. దీంలో అమెరికా విధించిన టారిఫ్‌లపై చైనా సీరియస్‌గా స్పందించి ప్రతీకార సుంకాలు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు మాత్రమే విధించే ఈ టారిఫ్‌లు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.చైనా ప్రతీకార సుంకాలపై ట్రంప్‌ స్పందించారు . చైనా భయపడింది తప్పు నిర్ణయం తీసుకుంది. మరో మార్గం లేకే ఈనిర్ణయం తీసుకుందని తప్పుబట్టారు ట్రంప్‌. ఇదిలా ఉంటే బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎగుమతులకు బ్రేక్‌ పడింది. ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో అమెరికాకు దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం ట్యాక్స్ విధించడంతో జేఎల్‌ఆర్‌ ఈనిర్ణయం తీసుకుంది.

 Elon Musk:సుంకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్

వాణిజ్య సంబంధాలు

ఇటలీ లీగ్ నాయకుడు మాటియో సాల్వినితో ముఖాముఖి మాట్లాడిన ఎలాన్ మస్క్, యూరప్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో అమెరికా, యూరప్ దేశాల మధ్య ఎలాంటి సుంకాలు లేకుండా వాణిజ్యం జరగాలని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడితే, వాణిజ్యానికి అడ్డంకులు తొలగిపోతాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని మస్క్ తెలిపారు.భవిష్యత్తులో అమెరికా – యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. ఇటలీతో సహా ఇతర యూరప్ దేశాలకు 20 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read Also: Donald Trump: ట్రంప్‌ నిర్ణయాలతో ఆర్థికవేత్తల ఆందోళన..అమెరికాలో మొదలైన ఉద్యోగాల కోత

Related Posts
రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

భారతీయులకు సౌదీ అరేబియా షాక్
visa

తమ దేశానికి వచ్చే వారిని నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. దీంతో భారత్ నుంచి అధికంగా సౌదీ అరేబియాకు వెళ్లే వారికి Read more

మంటల్లో హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు దగ్ధం
los angeles hollywood houses fire

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో కార్చిచ్చు చెలరేగింది. హాలీవుడ్ సెలబ్రిటీలు నివాసం ఉండే అత్యంత ఖరీదైన ఏరియా ‘ది సాలిసాడ్స్’ ను మంటలు చుట్టుముట్టాయి. దీంతో వేలాది Read more

డీప్‌సీక్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే జైలు శిక్ష
deepseek

కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×