సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఈ కుటుంబం,ఒకేసారిగా కుటుంబంలో ఆరుగురు అదృశ్యం కావడం తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రాత్రి ఆ ఉమా సోదరుడు భిక్షపతి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన వారిలో దాండ్ల ఉమ, ఆమె భర్త మహేష్, ఆరు, నాలుగు సంవత్సరాలు, తొమ్మిది నెలల వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు, ఉమ చెల్లెలు సంధ్య ఉన్నారు.
సీసీటీవీ ఫుటేజీ
మహేశ్ బోయిన్‌పల్లిలో నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.బుధవారం రాత్రి ఆ కుటుంబం ఇంటి నుంచి సామానుతో బయలుదేరి, తాము ఖాళీ చేస్తున్నట్లు ఇంటి యజమానికి తెలియజేసింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ కుటుంబం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వైపు వెళుతున్నట్లు కనిపిస్తోంది. వారి కదలికలను మరింత తెలుసుకోవడానికి ప్రస్తుతం ఎంజీబీఎస్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం, అని బోయిన్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.దినసరి కూలీ అయిన మహేష్ తన భార్య, పిల్లలతో న్యూ బోయిన్‌పల్లిలో నివసిస్తున్నాడు. ఏప్రిల్ 2న, సంధ్య వారిని చూడటానికి మేడ్చల్ నుంచి వచ్చింది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3న ఉదయం ఇంటి కుటుంబం మొత్తం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని సమాచారం ఇచ్చాడు ఇంటి యజమాని. కుటుంబ సభ్యులు తొలుత తెలిసిన ప్రాంతాల్లో వెతికి, మిత్రులను వాకబు చేసితెలిసిన వారితో మాట్లాడినా ఆచూకి లభించకపోవడంతో, పోలీసులను సంప్రదించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యుల అదృశ్యం స్థానికంగా భయాందోళనకు దారితీసింది.ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు,చుట్టుపక్కలవారు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.మహేష్ రోజువారీ కూలీగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ముగ్గురు చిన్నారులు , వీరి కుటుంబం సాధారణ జీవనశైలితో సాగుతున్నట్టు తెలుస్తోంది. ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఇంట్లో తగాదాలు జరిగాయా? లేక బయట ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.