Saree Movie Review: ‘శారీ మూవీ ’ రివ్యూ

Saree Movie Review: ‘శారీ మూవీ ’ రివ్యూ

రామ్ గోపాల్ వర్మ, ‘శారీ’ అనే కొత్త చిత్రంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ‘‘సొసైటీ ఏమైపోతే నాకేంటి? నా చావు నేను చస్తా మీ చావు మీరు చావండి’’ అని చెప్పే వర్మ, ఈసారి తొలిసారిగా సొసైటీకి సందేశం ఇచ్చే ప్రయత్నం చేయడం అంటే ఆశ్యర్యపడాల్సిందే.సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దారుణమైన నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘శారీ’ అనే చిత్రాన్ని సందేశాత్మకంగా చూపించారు. వర్మ ఏంటీ సందేశాత్మక చిత్రం ఏంటీ అందులోనూ నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటే వర్మ సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలి? లేదంటే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ‘శారీ’ ద్వారా సైకో థ్రిల్లర్‌ని చూపించారు.గత కొన్నేళ్లుగా వివాదాస్పద సినిమాలతోనే హాట్ టాపిక్ అవుతున్న వర్మ‘శారీ’ అనే ఎరోటిక్ సైకో థ్రిల్లర్‌కి రూపకల్పన చేశారు. ఈ సినిమాకి రచనా సహకారం అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమైన వర్మ తన శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ‘శారీ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.వర్మ తన చిత్రాల ద్వారా సందేశాలు ఇవ్వడానికి ఇష్టపడడు. కానీ ‘శారీ’ సినిమా ద్వారా తన శైలికి భిన్నంగా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Advertisements

కథ

ఆరాధ్య (ఆరాధ్య దేవి)కి చీరకట్టుకోవడం అంటే మహా ఇష్టం. సోషల్ మీడియాపై ఉన్న మోజుతో చీర కట్టుకుని రీల్స్ చేస్తూ ఉంటుంది. నిరంతరం చీరలోనే ఉంటుంది. తన చీరకట్టుని పొగుడుతూ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను చూసి పొంగిపోతూ ఉంటుంది. అలా ఓ పార్క్‌లో ఆరాధ్య.. ఫొటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు ) కంట పడుతుంది.అప్పటి నుంచి ఆరాధ్యను ఆరాధించడం మొదలుపెడతాడు. సోషల్ మీడియా ద్వారా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఫొటోషూట్ చేస్తానని ఆమె వెంటపడతాడు. ఫొటోలు, రీల్స్ పిచ్చి ఉన్న ఆరాధ్య కిట్టూతో పరిచయం పెంచుకుంటుంది. అయితే కిట్టూకి ఆరాధ్యపై ఉన్న ఇష్టం ప్రేమగామారుతుంది. ముఖ్యంగా ఆరాధ్యను శారీలోనే చూడ్డానికి ఇష్టపడతాడు.సైకో చేష్టలతో ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు.అయితే కిట్టు సైకో చేష్టల్ని గమనించిన ఆరాధ్య.అతన్ని దూరం పెడుతుంది. దాంతో పూర్తి సైకోగా మారిన కిట్టు ఆరాధ్యని కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత ఏమైంది? ఆ కిడ్నాప్ నుంచి ఆరాధ్య ఎలా తప్పించుకుంది? అన్నదే ‘శారీ’ మిగిలిన కథ.

rgv saree V jpg 442x260 4g

యాక్టింగ్ పరంగా

ఆరాధ్య తన ‘శారీ’లను పెట్రోల్ పోసి తగలబెట్టడంతో శారీ కథ మొదలౌతుంది. ఆ తరువాత ఆరాధ్యని కిట్టూ చూడటం ఆమెను ఊహించుకుంటూ పాటలు పాడుకోవడంతో ఫస్టాఫ్ సాగిపోతుంది.చీరలో ఆరాధ్యని వివిధ భంగిమలలో ఊహించుకోవడం ఓ సాంగ్ ఉండడం మధ్య మధ్యలో కిట్టు సైకో చేష్టలు బీభత్సమైన వయొలెన్స్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి రొటీన్ ముగింపు. వర్మ నుంచి అద్భుతాలు ఆశించడం ఆడియన్స్ ఎప్పుడో మర్చిపోయారు.ఆరాధ్య ‘శారీ’ టైటిల్‌కి కరెక్ట్ యాప్ట్ అనేట్టుగా బాగానే సూట్ అయ్యింది. యాక్టింగ్ పరంగా కూడా పర్వాలేదనిపించింది.సైకో ప్రేమికుడిగా సత్య యాదు భయపెట్టాడు. వీడేంట్రా ఇంత సైకోలా ఉన్నాడూ అనేట్టుగానే నటించాడు. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒకటే ఫ్లోలో వెళ్లిపోవడంతో బోరింగ్‌గా అనిపిస్తుంటుంది.ఆరాధ్యను చీరలో ఎంత అందంగా చూపించాలనేదానిపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల చీరని ఇలా కూడా కట్టొచ్చా అనేంతగా ఆరాధ్య అందాలతో నింపేశారు దర్శకుడు గిరి కృష్ణ కమల్. ఇక శబరి సినిమాటోగ్రఫీ అయితేఆరాధ్య ‘శారీ’పైనే కాదుఆమె శరీరాన్ని అణువణువు తడిమేసిట్టుగానే ఉంటుంది. శారీలో ఆమెను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా చూపించారు. తెల్ల చీరలోవెనుకే తెల్ల గుర్రం పరుగుపెట్టుకుంటూ వచ్చే గ్రీనరీ షాట్ హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి షాట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. సాంగ్స్ అయితే ఎందుకొస్తున్నాయో ఎప్పుడొస్తున్నాయో తెలియదు. వస్తాయి పోతాయి. శశి ప్రీతమ్ రీ రికార్డింగ్ వాయింపు మామూలుగా లేదు. అవసరం ఉన్నాలేకపోయినా వాయించిపారేసినట్టుగానే అనిపిస్తుంది.మొత్తంగా ఆర్జీవీ నుంచి వచ్చిన గత చిత్రాలకంటే ‘శారీ’ పర్వాలేదు. ఆర్జీవీ నుంచి సినిమా వచ్చిందా వెళ్లిందా? అనేట్టుగానే ఉంది ఈ ‘శారీ’.

Related Posts
అర్జిత్ సింగ్‌కు వచ్చిన పద్మశ్రీ అవార్డు పై వివాదాలు
Jaipur : Singer Arijit Singh performs during Rajasthan day celebration program in Jaipur, on March 28, 2016. (Photo: Ravi Shankar Vyas/IANS)

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్‌కు పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించారు. అయితే, అర్జిత్ కు Read more

థియేట‌ర్ల‌లో హిట్ – టీవీలో డిజాస్ట‌ర్‌
raayan

ధ‌నుష్ రాయ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కానీ టీవీలో డిజాస్ట‌ర్ ప్రముఖ నటుడు ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ మూవీ, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ గా Read more

అమరన్’ మూవీ రివ్యూ దేశం కోసం ఏదైనా చేయాలని కలలు,
Amaran OTT

అమరన్' సినిమా సమీక్ష: మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అమరన్’ సినిమా, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా Read more

Vijay Sethupathi: విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా
Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! విజయ్ సేతుపతితో కొత్త సినిమా

హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల కోసం ఎదురు చూసే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన టేకింగ్, పవర్‌ఫుల్ మాస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×