हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Mumbai: పది లక్షలు చెల్లించలేదని చికిత్స చేయకపోవడంతో గర్భిణీ మృతి

Anusha
Mumbai: పది లక్షలు చెల్లించలేదని చికిత్స చేయకపోవడంతో గర్భిణీ మృతి

మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్‌ హాస్పిటల్‌ సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణించింది.

హాస్పిటల్‌ నిర్లక్ష్యం

బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న సుశాంత్ భార్య తనిషా ఏడు నెలల గర్భిణి. గర్భంలో కవలున్న ఆమె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడింది. దీంతో పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు.తనిషాకు చికిత్స అందించేందుకు పది లక్షలను హాస్పిటల్‌ సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఆ డబ్బు చెల్లిస్తేనే చికిత్స ప్రారంభిస్తామని చెప్పారు. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఆమె భర్త సుశాంత్‌ చెప్పినప్పటికీ చికిత్సకు నిరాకరించారు. ఒకేసారి పది లక్షలు చెల్లించలేక తనిషాను మరో హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్సలో జాప్యం వల్ల డెలివరీ కాంప్లికేషన్స్‌తో ఆమె మరణించింది.

ఎమ్మెల్సీ స్పందన

భార్య తనిషా మరణానికి దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌ నిర్లక్ష్యం కారణమని ఆమె భర్త సుశాంత్‌ ఆరోపించాడు. ‘వారు జీవితం కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. సకాలంలో చేర్చుకున్నట్లయితే ఆమె బతికి ఉండేది’ అని వాపోయాడు. ఆ హాస్పిటల్‌ నిర్లక్ష్యంపై ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు కోసం మెడికల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖే ఈ సంఘటనపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు.అంతర్గతంగా విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అన్ని వివరాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.

Pregnant woman dies

ఈ ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకన్‌కర్, పూణే మునిసిపల్ కమిషనర్‌ను ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.డబ్బు కోసమే ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సమాజంలో ఆసుపత్రులు ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బును ప్రాధాన్యతగా చూడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.​

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

📢 For Advertisement Booking: 98481 12870