Narendra Modi :ప్రధాని మోదీతో ముహమ్మద్ యూనస్‌ భేటీ!

Narendra Modi :ప్రధాని మోదీతో ముహమ్మద్ యూనస్‌ భేటీ!

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్‌లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి.బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.

Advertisements

మోదీతో భేటీ

చైనా-బంగ్లాల మధ్య మిత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి మోదీతో భేటీ కోసం యూనస్‌ తరఫున బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ భారత్‌ను అభ్యర్థించింది.తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పడంతో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భేటీకి ఒప్పుకున్నారు. షేక్‌ హసీనా దేశం వీడిన నాటినుంచి భారత్‌-బంగ్లా సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆ దేశంలోని మైనార్టీల రక్షణపై భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.

మహమ్మద్‌ యూనస్‌

ఇటీవల మహమ్మద్‌ యూనస్‌ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా భారత్-బంగ్లా మధ్య దూరం పెంచింది. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్లు ఉన్నాయన్నారు. బిమ్‌స్టెక్‌ దేశాలకు ఇది కీలకమైన కనెక్ట్‌విటీ హబ్‌గా అభివర్ణించారు.దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందిస్తూ, బంగాళాఖాత ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, విస్తృతమైన అనుసంధానతను నొక్కి చెప్పారు. భారత్‌కు 6,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, బిమ్‌స్టెక్ లోని ఐదు సభ్య దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ల విస్తృత నెట్‌వర్క్‌తో ఈశాన్య ప్రాంతాన్ని కనెక్టివిటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా మధ్య భారత్ కీలక వారధి అని ఆయన స్పష్టం చేశారు.

Modi Yunus Meet

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఆగస్టులో కూలిపోయింది.ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ విడిచి, భారత వైమానిక దళ విమానంలో ఢిల్లీ సమీపంలోని హిందన్ వైమానిక స్థావరానికి చేరుకున్నప్పటి నుండి భారతదేశంలోనే ఉంటున్నారు.బంగ్లాదేశ్‌ పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హీసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ నాయకత్వంలోనే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీవ్రవాద విధానాలు, వేర్పాటువాదులను జైళ్ల నుంచి విడుదల చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts
నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటి? : శశిథరూర్‌
What is the benefit of this zero tax for the unemployed? : Shashi Tharoor

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ Read more

ఫైనల్ పోరు: అభిమానుల్లో ఉత్కంఠత
ఫైనల్ పోరు: అభిమానుల్లో ఉత్కంఠత

భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ Read more

బై..బై చెపుతూ ‘బైడెన్’ సంచలన నిర్ణయం
joe biden comments

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగియడానికి కొద్ది గంటల ముందు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కోవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా. ఆంటోనీ Read more

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పై స్పందించిన అక్షర్ పటేల్
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పై స్పందించిన అక్షర్ పటేల్

ఐపీఎల్ 2025 సీజన్‌లో బుధవారం (ఏప్రిల్‌ 16) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.తొలి సూపర్‌ ఓవర్‌ పోరులో రాజస్థాన్‌పై ఢిల్లీ ఉత్కంఠ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×